Watch Video: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ.. చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..

Watch Video: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ.. చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..

Srikar T

|

Updated on: Apr 27, 2024 | 6:13 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్గాపూర్‌లో ప్రచారానికి వెళ్లారు ఆమె. ప్రచారం ముగించుకుని తిరుగుపయనంలో హెలికాప్టర్ ఎక్కి తన సీటులో కూర్చోబోతుండగా కాలుజారి చాపర్‌లో పడిపోయారు. ఉన్న పళంగా కిందపడిపోవడంతో ముఖ్యమంత్రికి భద్రతా సిబ్బంది సహాయం అందించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుర్గాపూర్‌లో ప్రచారానికి వెళ్లారు ఆమె. ప్రచారం ముగించుకుని తిరుగుపయనంలో హెలికాప్టర్ ఎక్కి తన సీటులో కూర్చోబోతుండగా కాలుజారి చాపర్‌లో పడిపోయారు. ఉన్న పళంగా కిందపడిపోవడంతో ముఖ్యమంత్రికి భద్రతా సిబ్బంది సహాయం అందించారు. దుర్గాపూర్ ప్రచారం తరువాత ఆమె అసన్సోల్‌కు ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే హెలికాప్టర్‌లో కూర్చుంటున్న సమయంలో ఆమె కిందపడిపోవడంతో దీదీకి గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే మమతను ఆస్పత్రికి తరలించారు భద్రతా సిబ్బంది. అంతకు ముందు తన నివాసంలో వ్యాయామం చేస్తున్న క్రమంలో కూడా దీదీ కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. అయితే గతంలో ఇలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె వీల్ ఛైర్ పైనే కూర్చొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  తాజాగా మమతా బెనర్జీ కింద పడిపోవడంపై ఆమె అభిమానుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 27, 2024 06:07 PM