Viral Video: వార్నీ.. వీడి వేషాలో..! లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడి.. భలే మస్కా కొడుతున్నాడే..!

వీడియోలో, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి స్కూటర్‌తో సరదాగా రైడింగ్‌కు బయల్దేరాడు. కొంత దూరం వెళ్లగానే లేడీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. బైక్‌ కీస్‌ లాగేసుకున్నారు. దాంతో ఆ కుర్రాడు చేసిన పని ట్రాఫిక్‌ పోలీసులకే కాదు.. నెటిజన్లకు సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పించింది. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కుర్రాడు ఎలాంటి నాటకాలు చేస్తాడో చూస్తే పగలబడి నవ్వుకుంటారు.

Viral Video: వార్నీ.. వీడి వేషాలో..!  లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడి..  భలే మస్కా కొడుతున్నాడే..!
Traffic Police
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 27, 2024 | 9:49 PM

రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. అలా చేయని పక్షంలో ట్రాఫిక్ పోలీసులు శిక్షార్హమైన చర్యలు తీసుకుంటారు. కానీ, ఇలాంటి సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన చాలా మంది పోలీసులకు రకరకాల సాకులు చెప్పడం ప్రారంభిస్తారు. కొంతమంది పోలీసులకు డబ్బులిచ్చి విషయాన్ని పెద్దదిగా కాకుండా చేస్తారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఓ కుర్రాడు ఏం చేసాడో చూసి చాలా మంది నవ్వు ఆపుకోలేక పోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో, ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి స్కూటర్‌తో సరదాగా రైడింగ్‌కు బయల్దేరాడు. కొంత దూరం వెళ్లగానే లేడీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. బైక్‌ కీస్‌ లాగేసుకున్నారు. దాంతో ఆ కుర్రాడు చేసిన పని ట్రాఫిక్‌ పోలీసులకే కాదు.. నెటిజన్లకు సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్వు తెప్పించింది. ట్రాఫిక్‌ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కుర్రాడు ఎలాంటి నాటకాలు చేస్తాడో చూస్తే పగలబడి నవ్వుకుంటారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో ఓ చిన్న పిల్లాడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్కూటర్‌పై వెళ్తున్నాడు.. ఈ సమయంలో స్కూటీపై కూర్చున్న ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించలేదు. అకస్మాత్తుగా లేడీ ట్రాఫిక్ పోలీసు దృష్టి బాలుడి స్కూటీ వైపు వెళ్లింది. వెంటనే వారు ఆ పిల్లాడి స్కూటీని ఆపారు. అంతే.. ఆ పోలీసులను చూసిన కుర్రాడు భయపడి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. పోలీసులు ఏది చెప్పకముందే వాడు బోరుమంటూ ఏడుస్తున్నాడు. నా బండి వదిలిపెట్టండి ఆంటీ.. ప్లీజ్‌..అంటూ వేడుకుంటున్నాడు. ఆంటీ, దయచేసి నన్ను వదిలేయండి.. లేకపోతే పాప నన్ను చంపేస్తాడంటూ గోల గోల చేశాడు.

ఈ సమయంలో అతని ఇద్దరు స్నేహితులు సైలెంట్‌గా పక్కకు వెళ్లి నిలబడ్డారు. అయితే, బాలుడు లేడీ పోలీసు అధికారి కాళ్లపై పడి మరీ బైక్ తాళాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ, తనను విడిచిపెట్టమని వేడుకున్నాడు. కుర్రాడు ఏడ్చినట్లు నటిస్తుండటం చూసి లేడీ ట్రాఫిక్ పోలీసులు కూడా నవ్వడం మొదలుపెట్టారు.

ఈ వీడియో @prof_desi అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేయబడింది. వీడియో చూసిన తర్వాత, బాలుడి నటనకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. వీడికి ఆస్కార్ ఇవ్వాల్సిందేనంటూ కామెంట్‌ చేశారు చాలా మంది. ఆ బాలుడిని కరుణించాలని పలువురు కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జనాలు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..