Telangana: నెలల చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం.. ప్రమాదమని నమ్మించేందుకు నాటకాలు

బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చీరాని మాటలతో ముద్దులొలికే చేష్టలు చేస్తూ ఆ చిన్నారి అల్లరి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అప్పటి వరకూ కళ్లముందే ఆడుకుంటూ ఉన్న చిన్నారి క్షణాల్లో విగత జీవిగా మారి ఆ తల్లిదండ్రులకు పుట్టుడు దుఃఖాన్ని మిగిల్చాడు. ఇంటి ముందు తోటి పిల్లలతో కలిసి ఆటాడుకుంటున్న చిన్నారి.. ఇంటి యజమాని నిర్లక్ష్యానికి బలైపోయాడు. వేగంగా కారు నడిపి చిన్నారి నిండు..

Telangana: నెలల చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం.. ప్రమాదమని నమ్మించేందుకు నాటకాలు
Car Accident
Follow us

|

Updated on: Aug 20, 2024 | 6:36 AM

బాలాపూర్‌, ఆగస్టు 20: బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చీరాని మాటలతో ముద్దులొలికే చేష్టలు చేస్తూ ఆ చిన్నారి అల్లరి చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అప్పటి వరకూ కళ్లముందే ఆడుకుంటూ ఉన్న చిన్నారి క్షణాల్లో విగత జీవిగా మారి ఆ తల్లిదండ్రులకు పుట్టుడు దుఃఖాన్ని మిగిల్చాడు. ఇంటి ముందు తోటి పిల్లలతో కలిసి ఆటాడుకుంటున్న చిన్నారి.. ఇంటి యజమాని నిర్లక్ష్యానికి బలైపోయాడు. వేగంగా కారు నడిపి చిన్నారి నిండు జీవితాన్ని చిదిమేశాడు. ఆనక ప్రమాదంగా నమ్మించేందుకు విఫలయత్నం చేశాడు. తీరా సీసీఫుటేజీ చూడటంతో అసలు బండారం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

కడ్తాల్‌కు చెందిన వరికుప్పల రామకృష్ణ, జ్యోతి దంపతులు. వీరికి 22 నెలల వయసున్న దీక్షిత్‌ సంతాంన. కొన్ని రోజుల క్రితం మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం జడ్పీ రోడ్డులోని కొత్తకాపు దినేశ్‌రెడ్డి ఇంట్లో అద్దెకు దిగారు. ఆదివారం రాత్రి తల్లి జ్యోతి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది. ఇంతలో కుమారుడు దీక్షిత్‌ ఇంటి ముందు పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఇంటి యజమాని వేగంగా కారులో వచ్చి.. ఆడుకుంటున్న చిన్నారి దీక్షిత్‌ను ఢీ కొట్టాడు.

దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని తన కారులోనే తీసుకెళ్లి.. ఎల్బీనగర్‌లో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించాడు. ప్రమాదశాత్తు కిందపడటంతో చిన్నారికి దెబ్బ తగిలిందని అందరికీ నమ్మబలికాడు. చికిత్స పొందుతూ దీక్షిత్‌ మృతి చెందాడు. ఇంటి యజమాని మాటలతో చిన్నారి తల్లిదండ్రులకు అనుమానం రావడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీ చూడటంతో అసలు విషయం బయటికి వచ్చింది. యజమాని నిర్లక్ష్యంగా కారు నడపి, చిన్నారిని ఢీ కొట్టినట్లు వెల్లడైంది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు మీడియాకు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.