గజం భూమి ధర రూ.10 లక్షలు !! హైదరాబాద్‌లో భూమి ధర అక్కడే ఎక్కువ
హైదరాబాద్‌లో భూమి ధర ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, గచ్చిబౌలి పేర్లు వినిపిస్తాయి. కానీ, వాటిని తలదన్నేలా బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతోంది. ముంబయిలో మాదిరిగా ఇక్కడ గజం భూమి తక్కువలో తక్కువ రూ.10 లక్షల వరకు పలుకుతోంది. భూమి లభ్యత లేకపోవడంతో పాత భవనాలే నూతన నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి.
హైదరాబాద్‌లో భూమి ధర ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, గచ్చిబౌలి పేర్లు వినిపిస్తాయి. కానీ, వాటిని తలదన్నేలా బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతోంది. ముంబయిలో మాదిరిగా ఇక్కడ గజం భూమి తక్కువలో తక్కువ రూ.10 లక్షల వరకు పలుకుతోంది. భూమి లభ్యత లేకపోవడంతో పాత భవనాలే నూతన నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్రకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులు ఎంతోమంది ఇక్కడే స్థిరపడ్డారు. చదరపు అడుగుల చొప్పున అమ్మకాలు జరిగే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలోనే పలుకుతున్నాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట భూములకు అత్యధిక ధరలు ఉన్న మాట నిజమే. కానీ, అంతకు మించిన ధరలు ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని బేగంబజార్‌లో పలుకుతున్నాయి. ముంబయిలో మాదిరిగా ఇక్కడ భూములకు ధరలు ఉన్నాయి. ఇక్కడ గల్లీ, వీధిని బట్టి గజానికి కనీస ధర రూ.10 లక్షలకు తక్కువ కాకుండా పలుకుతోంది.ఇక్కడ కొత్తగా స్థలాల లభ్యత లేదు. పాతవి, పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలే ఇక్కడి యజమానులకు రూ.కోట్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజీవ్‌గాంధీ vs తెలంగాణ తల్లి.. రగులుతున్న విగ్రహ రాజకీయం
మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!
Explainer: టాలివుడ్ చేసిన నేరమేంటి ?? అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ??