iSmart News: రుణమాఫీ కాలేదని సెల్ టవరెక్కాడు !!
అన్నట్టు.. తెలంగాణల రైతుల రుణమాఫీ చేశినమని సర్కారోల్లు చెప్పెగదా? వాళ్లట్ల చెప్తున్నరుగని బ్యాంకుల మా బకాయిలింక మాఫ్ కాలేదని కొంతమంది రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్కుంట నిరసన తెల్పుతున్నరు.. అయితె అందరిట్ల నేను కలిస్తె ఎట్ల అనుకుండో ఏమో.. కామారెడ్డి జిల్లాల ఒక రైతన్న ఏకంగ ఏంజేశిండో సూడు..
అన్నట్టు.. తెలంగాణల రైతుల రుణమాఫీ చేశినమని సర్కారోల్లు చెప్పెగదా? వాళ్లట్ల చెప్తున్నరుగని బ్యాంకుల మా బకాయిలింక మాఫ్ కాలేదని కొంతమంది రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్కుంట నిరసన తెల్పుతున్నరు.. అయితె అందరిట్ల నేను కలిస్తె ఎట్ల అనుకుండో ఏమో.. కామారెడ్డి జిల్లాల ఒక రైతన్న ఏకంగ ఏంజేశిండో సూడు.. రైతు రుణమాఫీల మీద శిన్నగ మెల్లెగ రాజకీయం రాజుకుంటందిగదా మొన్నటిసంది..? చేశినమని.. సర్కారోల్లు.. సగంమందికన్న చెయ్యలే అన అపోజిషన్ పార్టోల్లు పోటీపోటీగ రాజకీయాలు చేస్తున్నరు.. అయితె బకాయిలు మాఫైనోల్లు సంబురపడ్తుంటె.. కానోల్లేమొ రాస్తారోకోలు, ధర్నాలకు దిగతున్నరు. అందరట్ చేస్తుంటె.. ఇగొ గీ రైతన్న సూడు.. బ్యాంకులోన్ బకాయ్ మాఫ్ గాలేదని ఏంజేశిండో.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి తండాలుంటడట.. సెల్ టవరెక్కిన గీ కేతావత్ రవి అనే రైతు.. నాకు బకాయి్ మాఫ్ కాలేదని.. బిక్కనూర్ మండలం జంగంపల్లికాడున్న సెల్ టవరెక్కిట్ల నిరసన చేశిండు.. రొండు లక్షల రుణమాఫీ అయితున్నోల్ల లిస్టుల పేరొచ్చిందట.. కని మాఫీ కాలేదట.. ఇదేందని కామారెడ్డి కలెక్టర్ కాడికి, అగ్రికల్చర్ అధికారులకాడికి తిరిగిండట రొండ్రోజులు.. కని పట్టిచ్కున్నోల్లు లేరు.. అడిగినోల్లు లేరట.. ఇగిట్ల కాదని సక్కగొచ్చి సెల్ టవరెక్కిండు.. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: SSLV-D3 ప్రయోగం సక్సెస్.. ప్రకృతి విపత్తులపై ఇక డేగ కన్ను Explainer: మంకీపాక్స్.. ముంచేస్తుందా ?? దీని లక్షణాలు ఏంటంటే ?? Explainer: అన్న క్యాంటీన్ మెనూ ఇదే.. ఆహార పరిమాణం ఎంతంటే...
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

