రాజీవ్‌గాంధీ vs తెలంగాణ తల్లి.. రగులుతున్న విగ్రహ రాజకీయం
తెలంగాణలో మరో సరికొత్త వివాదం రగులుతోంది. సెక్రటేరియట్ ముందు నెలకొల్పే స్టాచ్యూ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించిన రేవంత్‌రెడ్డి ఆ దిశగా అడుగులేస్తున్నారు. తెలంగాణ గీతం, తెలంగాణ రాజ ముద్ర మార్చేస్తానంటూ ఆ మధ్య చర్యలకు ఉపక్రమించారు.
తెలంగాణలో మరో సరికొత్త వివాదం రగులుతోంది. సెక్రటేరియట్ ముందు నెలకొల్పే స్టాచ్యూ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించిన రేవంత్‌రెడ్డి ఆ దిశగా అడుగులేస్తున్నారు. తెలంగాణ గీతం, తెలంగాణ రాజ ముద్ర మార్చేస్తానంటూ ఆ మధ్య చర్యలకు ఉపక్రమించారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలతో రాజముద్రను మార్చే కార్యక్రమాన్ని పక్కకు పెట్టారు. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టంచాలనుకున్న ప్లేస్‌లో తాజాగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం మరో వివాదానికి దారి తీసింది. సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. విగ్రహం నెలకొల్పే ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. వారితో పాటు ప్రాంగణాన్ని పరిశీలించిన వారిలో వేం నరేందర్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్ ఉన్నారు. ఇప్పటికే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సిద్దం చేశారు. ఈనెల 20వ తేదీన రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ల్యాండ్ స్కేపింగ్, ఇతర పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రాంగణ మ్యాప్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు మంత్రులు పొన్నం, పొంగులేటి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. మీ ఇళ్లు జాగ్రత్త !!
Explainer: టాలివుడ్ చేసిన నేరమేంటి ?? అసలు ఎందుకు ఇలా జరిగిందంటే ??
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

