AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగర శివారులోనూ మోత మోగిస్తున్న ధరలు.. ఆగస్టు 23 నుంచి మోకిల భూముల ఫేస్ 2 అన్‌లైన్ వేలం..

Hyderabad: హెచ్ఎండీఏ భూముల వేలానికి విశేష స్పందన లభిస్తోంది. నగరశివారుల్లో డెవలప్ చేసిన ప్లాట్లను ఒక్కొక్కటిగా వేలం వేస్తూ వస్తోంది హెచ్ఎండీఏ. కోకాపేట్, బుద్వేల్, మోకిల, షాబాద్ ప్లాట్ల వేలంతో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరింది. దీంతో అదే జోష్ తో మోకిలలో ఫేజ్-2 వేలానికి సర్కారు సిద్ధమైంది. ప్రీబిడ్డింగ్ మీటింగ్ కు బిడ్డర్లు పెద్దఎత్తున హాజరయ్యారు. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకిలలో ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ కు దగ్గర కావడం, మోకిల వైపు ఎక్కువ విల్లాలు ఉండటంతో భూములు ధరలు భారీగా..

Hyderabad: భాగ్యనగర శివారులోనూ మోత మోగిస్తున్న ధరలు.. ఆగస్టు 23 నుంచి మోకిల భూముల ఫేస్ 2 అన్‌లైన్ వేలం..
Mokila E-Auction, Phase 2
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Aug 17, 2023 | 6:12 PM

Share

Hyderabad: రండి బాబు రండి.. ఆలోచించినా ఆశాభంగం.. అంటూ తెలంగాణ ప్రభుత్వం సర్కారు భూముల అమ్మకాన్ని కొనసాగిస్తోంది. హైదరాబాద్ నగర శివారుల్లో రియల్ భూమ్‌తో భూముల ధరలకు రెక్కలు రావడం ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కోకాపేట్‌లో ఎకరం రూ.100 కోట్లు, బుద్వేల్‌లో ఎకరం 41 కోట్లతో రికార్డుల తిరగరాస్తే.. కాస్త దూరంలో ఉన్న మోకిలలో సైతం చదరపు గజం లక్షా 5 వేల రూపాయలతో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో భూముల ధరలు బంగారాన్ని మించిపోయాయని అనుకుంటున్నారు. మోకిలలో ఆగస్టు 7న 50 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయగా.. 121 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఊపుతో అక్కడే మిగిలిన ప్లాట్లకు ఫేజ్-2 తో వేలానికి సిద్దమైంది.

నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోకిలలో ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు దగ్గర కావడం, మోకిల వైపు ఎక్కువ విల్లాలు ఉండటంతో భూములు ధరలు భారీగా పెరిగాయి. హెచ్ఎండీఏ ఇప్పటికే 165 ఎకరాల్లో 350కి పైగా ప్లాట్లను డెవలప్ చేసింది. ఫేజ్ -1 లో 50 ప్లాట్లను విక్రయంచింది. ఇప్పుడు ఫేజ్-2 పెద్ద ఎత్తున మిగిలిన 300 ప్లాట్లను వేలం వేసేందుకు సన్నద్ధమైంది. 300 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు ఇందుల్లో ప్లాట్లు ఉన్నాయి. 195 ప్లాట్లు 300 గజాలు, 8 ప్లాట్లు 333 గజాలు, 8 ప్లాట్లు 367 గజాలు, 59 ప్లాట్లు 375 గజాలు, 20 ప్లాట్లు 400 గజాలు, 2 ప్లాట్లు 417 గజాలు, 2 ప్లాట్లు 458 గజాలు, మరో ఆరు ప్లాట్లు 500 గజాల విస్తీర్ణంతో ఉన్నాయి. ఇక్కడ మినిమిమ్ అప్ సెట్ ప్రైస్ చదరపు గజానికి 25 వేల రూపాయలుగా నిర్ధరించారు.

గురువారం నిర్వహించిన ప్రిబిడ్డింగ్ మీటింగ్ కు పెద్దఎత్తున ఔత్సాహికులు హాజరయ్యారు. భూముల గురించి వివరాలు, లే అవుట్ ప్లాన్, రాబోయే పెసిలిటీస్ సహా వేలం పాట ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ నెల 23,24,25,28,29 తేదీల్లో 300 ప్లాట్లకు ఆన్ లైన్ వేలం నిర్వహించునున్నారు. రోజూ రెండు సెషన్స్ లో 60 ప్లాట్ల చొప్పున వేలం వేయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 30 ప్లాట్లు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 30 ప్లాట్లను ఈ-వేలం వేస్తారు.

ఇవి కూడా చదవండి

మోకిలలో భూముల ధరలు విపరీతంగా పెరిగినా డిమాండ్ కూడా అంతే ఉంది, గతంలో చదరపు గజం లక్షా 5 వేలు పలికినా బిడ్డర్లు మాత్రం తగ్గేదే లే అంటూ వేలం పాటకు రెడీ అంటున్నారు. సర్కారే స్వయంగా భూములు అమ్ముతుండటంతో ఎలాంటి చిక్కులు ఉండవని.. అనుమతులకు ఇబ్బంది ఉండదని ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. 18 నెలల్లో వెంచర్లో అన్ని రకాల మౌళికవసతుల కల్పన చేస్తామని హెచ్ఎండీఏ చెబుతోంది. దీంతో ఇంకేందుకు ఆలస్యం అంటూ బిడ్డర్లు, ఔత్సాహికులు భూములు కొనేందుకు సిద్ధమవుతున్నారు.