Hyderabad: పేదలకు పండగలాంటి వార్త చెప్పిన కేటీఆర్‌.. వారందరికీ డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపైన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం..

Hyderabad: పేదలకు పండగలాంటి వార్త చెప్పిన కేటీఆర్‌.. వారందరికీ డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు
Hyderabad Double Bed Room
Follow us
Sridhar Prasad

| Edited By: Narender Vaitla

Updated on: Aug 17, 2023 | 7:01 PM

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ ప్రజలకు శుభ వార్త తెలిపారు. మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పండగలాంటి వార్త చెప్పారు. మూసీ నది అడ్డంకులు తొలగించేలా.. మూసీలో దుర్బర పరిస్ధితులలో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అన్నీ ప్రాథమిక సౌకర్యాలున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతాల్లో మూసీ పేదలకు పునరావాసం కల్పించనున్నారు. సూమారు 10 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం ఇందుకు ఉపయోగించుకోనుంది. మూసీ అక్రమణల తొలగింపు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయింపు కోసం ప్రభుత్వానికి నగర ఎమ్మెల్యేలు ఎకగ్రీవ వినతి ఇచ్చారు. మూసీ అడ్డంకులు తొలగిన తర్వతా మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం చేయనున్నారు. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రాథమిక ప్లానింగ్ పూర్తి చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపైన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్ ఏన్ డిపి కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు.

Minister Ktr

ఇవి కూడా చదవండి

మారనున్న మూసీ ముఖచిత్రం..

మూసీ నది పరివాహక ప్రాంతాలను సుందరీకరించడంలో భాగంగా అక్కడ నివాసం ఉంటున్న వారిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను వారికి ఇవ్వనున్నారు. మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న ప్రజలకు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల రూపంలో ఉపశమనం లభిస్తుందని మంత్రి అన్నారు. అలాగే మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే వచ్చే వారంలో రాష్ట్రవ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోటనే నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాల లో జరిగిన విస్తృతమైన అభివృద్ధిని పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలును తమకు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని సందర్భంగా మంచి కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..