Telangana Elections: అజహరుద్దీన్‌పై ‘హెచ్‌సీఏ’ అవినీతి మరక.. డోలాయమానంలో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ చేసారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజహరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కోట్ల రూపాయల నిధులను అజాహరుద్దీన్..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ చేసారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజహరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కోట్ల రూపాయల నిధులను అజాహరుద్దీన్ అండ్ కో పక్కదారి పట్టించిందని, టెండర్ల పేరుతో థర్డ్ పార్టీ కి నిధులు కట్టబెట్టిందని HCA నిధుల పై ఆడిట్ నిర్వహించిన జస్టిస్ లావ్ నాగేశ్వర్ రావు కమిటీ నిర్ధారించింది. ముఖ్యంగా క్రికెట్ బాల్స్ కొనుగోలు లో భారీ గోల్‌మాల్ జరిగిందని కమిటీ నిగ్గుతేల్చింది. ఒక్కో బాల్ ను 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ ఇచ్చారని, ఇలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షలు నష్టం కలిగించారని కమిటీ తెలిపింది. అలాగే బకెట్ చైర్స్ కొనుగోలు పేరుతో జరిగిన గొల్‌మాల్‌లో HCA కు 43 లక్షలు నష్టం జరిగిందని కనుగొన్నారు. ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరుతో 1.50 కోట్లు HCA కు నష్టం వాటిలినట్టుగా కమిటీ అభిప్రాయపడింది. జిమ్ పరికరాల పేరుతో 1.53 కోట్లు నష్టం.. ఇలా కోట్లాది రూపాయల హెచ్‌సీఏ నిధులను దోచుకున్నారని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
హైదరాబాద్ క్రికెట్ సంఘం ముఖ్య కార్యనిర్వాహణాధికారి సునీల్ కంటే ఉప్పల్ పోలీసులకుఇదే విషయంపై ఫిర్యాదు చేయడంతో IPC 406,409, 420, 465, 467, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2019-2022 మధ్య హెచ్ సీ ఏ అధ్యక్షుడిగా అజర్ ఉన్న సమయంలో అక్రమాలు జరిగినట్టు ప్రత్యేక విచారణ కమిటీ నిర్ధారించింది. కాగా ఇప్పుడు ఈ అవినీతి మరక అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశలపై నీళ్ళు చల్లినట్టేనని చర్చ జరుగుతుంది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో అజహరుద్దీన్ కి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే పార్టీపై జనాల్లో చులకన అయ్యే అవకాశముందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గినట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డికే జూబ్లీ హిల్స్ టికెట్ ఖరారు చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ప్రకటించనున్న నేపథ్యంలో నమోదైన ఈ కేసు అజహరుద్దీన్‌కు పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చేయండి..