Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. పోలీస్ శాఖలో నార్త్ అధికారులకు కీలక బాధ్యతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐపీఎస్ అధికారుల బదిలీలు తీవ్ర చర్చనీయాంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజు నుంచే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగంలో ప్రక్షాళన చేపడుతోంది. సౌత్ ఆఫీసర్లకు కాకుండా నార్త్ ఆఫీసర్లకు కేంద్ర ఎన్నికల కమిషన్ పెద్ద పీట వేస్తోందన్న చర్చ జరుగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. పోలీస్ శాఖలో నార్త్ అధికారులకు కీలక బాధ్యతలు
IPS Officers
Follow us
Vijay Saatha

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 21, 2023 | 2:49 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐపీఎస్ అధికారుల బదిలీలు తీవ్ర చర్చనీయాంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజు నుంచే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగంలో ప్రక్షాళన చేపడుతోంది. సౌత్ ఆఫీసర్లకు కాకుండా నార్త్ ఆఫీసర్లకు కేంద్ర ఎన్నికల కమిషన్ పెద్ద పీట వేస్తోందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కమిషనరేట్లలో నార్త్ ఆఫీసర్లను కమిషనర్లుగా నియమించింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు నాన్ క్యాడర్ ఐపీఎస్‌లు కొన్ని జిల్లాల ఎస్పీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండే తెలంగాణలో కీలక పదవుల్లో ఉన్న కీలక పదవుల్లోని పోలీసు అధికారులపై ఈసీ దృష్టి సారించింది. మొదటి దశ పోలీస్ అధికారుల బదిలీలలో చాలామంది నాన్ క్యాడర్ ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. కీలక జిల్లాలు వరంగల్, నిజామాబాద్ లాంటి జిల్లాలలో డైరెక్ట్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది.

ప్రధాన కమిషనరేట్లలో అంతా నార్త్ అధికారులే..

ప్రస్తుతం హైదరాబాద్ సిటీతో పాటు చాలా జిల్లాలలో నార్త్ ఆఫీసర్‌లకే ఎలక్షన్ కమిషన్ పట్టం కట్టింది. హైదరాబాద్ సీపీ పదవి నుంచి సీవీ ఆనంద్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో నార్త్‌కి చెందిన సందీప్ శాండిల్యను నియమించారు. అలాగే  వరంగల్ కమిషనర్ గా ఉన్న రంగనాథ్‌ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్‌ స్థానానికి బదిలీచేశారు.  ఆయన స్థానంలో బీహార్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝాను వరంగల్ సీపీగా నియమించారు.  నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్‌, మహబూబాబాద్ ,నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట లాంటి జిల్లాలలో నార్త్ ఆఫీసర్లకు ఎస్పీలుగా పోస్టింగ్ ఇచ్చారు. ఇక చాలా కాలంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్‌లో సీనియర్ లెవల్‌లో పనిచేసిన రాధా కిషన్ రావును ఆ బాధ్యతల నుంచి తప్పించి.. ఆయన స్థానంలో 2017 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన నార్త్ ఆఫీసర్ నిఖిత పంత్ కు  పోస్టింగ్ ఇచ్చారు.

తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో కీలక పదవుల్లో ఉన్న సౌత్ ఆఫీసర్ల స్థానంలో నార్త్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్‌ని మొదలుకొని హైదరాబాద్, రాచకొండ కమిషనర్లతో పాటు చాలా జిల్లాల ఎస్పీలుగా, నగరాల పోలీస్ కమిషనర్లుగా నార్త్ అధికారులు పనిచేస్తుండటం విశేషం.