AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలోని ఆ ఉమ్మడి జిల్లాపై బీజేపీ స్పెషల్ ఫోకస్..

అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీ నజర్ చేసింది. ముఖ్యంగా ఇతర పార్టీల కీలక నేతలు పోటీ స్థానాలపైనే దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే.. అధికార పార్టీ బీఆర్ఎస్. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే.. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పట్టు ఉన్న ప్రాంతంలోనే.. విజయం సాధించాలనే ఆలోచనతో ముందుకు సాగుతుంది.

Telangana Elections: తెలంగాణలోని ఆ ఉమ్మడి జిల్లాపై బీజేపీ స్పెషల్ ఫోకస్..
Telangana BJP
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 21, 2023 | 2:12 PM

Share

అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీ నజర్ చేసింది. ముఖ్యంగా ఇతర పార్టీల కీలక నేతలు పోటీ స్థానాలపైనే దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే.. అధికార పార్టీ బీఆర్ఎస్. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళ్తుంది. అయితే.. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పట్టు ఉన్న ప్రాంతంలోనే.. విజయం సాధించాలనే ఆలోచనతో ముందుకు సాగుతుంది. అంతేకాదు.. కీలకమైన నేతలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక్కడని నుంచి సగానికి పైగా.. బిసి సామాజిక వర్గానికి చెందిన నేతలు రంగంలోకి దిగుతున్నారు. దసరా తరువాత బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా త్రిముఖ పోరుగా మారుతే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టమనే కోణంలో విశ్లేషణలు మొదలయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. బీజేపీకి మంచి పట్టు ఉంది. ఈ జిల్లాలో ఒక ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. అయితే.. తెలంగాణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కీలక నేతలు ఇక్కడి నుంచే బరిలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. కరీంనగర్ నుంచీ బరిలోకి దిగనున్నారు. అదే విధంగా బీజేపీ తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. అదే విధంగా.. అరవింద్ కోరుట్ల నుంచీ బరిలో ఉండమన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్: జిల్లాలో13 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. బీఆర్ఎస్ 12 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచింది. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో హుజురాబాద్‌లో బీజేపీ విజయం సాధించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనుహ్యంగా భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించింది. కరీంనగర్ పార్లెమెంటు నియోజకవర్గంలో బీజేపీ తరుఫున బండి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఎంపీ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.

దీంతో.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అయా నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టింది బీజేపీ. ముఖ్యంగా కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి. వేములవాడ, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ కేడర్‌ కూడా పుంజుకుంది. ఇక ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునేలా ఫ్లాన్ చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.

అదే విధంగా కోరుట్ల నుంచి అరవింద్ బరిలో దిగుతూ.. పక్కనే ఉన్న జగిత్యాల నియోకవర్గంపై దృష్టి పెడుతున్నారు. ఇక్కడ భోగ శ్రావణీ… రంగంలోకి దింపమన్నట్లు సమాచారం. ఈమె.. బీసీ కావడంతో.. మెజారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఇక్కడ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు.. ఓసి అభ్యర్థులే. దీంతో.. బిసి ఓట్లతో బయటపడేందుకు ప్లాన్ చేస్తుంది.. మొత్తం…. 8 చోట్ల గట్టి పోటీ ఇచ్చి కనీసం ఐదు చోట్లనైనా విజయం సాధించేందుకు పక్కా ప్లాన్ చేస్తుంది. గతంలో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పట్టు ఉంది. బలమైన నేతలు లేకపోవడంతో.. గెలువలేకపోయారు. అయితే పరిస్థితులు మారాయి. ఈక్రమంలోనే ఇప్పుడు ఈ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి సారించినట్లు బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్.. ఈ నియోజకవర్గాలో ఎక్కువగా పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దసరా తరువాత ప్రచారం మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. చూడాలని మరీ ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో…!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..