మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు .. ఎమ్మెల్యే తనను చంపేందుకు సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపారంటూ..
Mancherial : అయితే ప్రేంసాగర్ రావు చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే దివాకర్ రావు ఎలా స్పందిస్తారన్నది నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో చేసిన కామెంట్స్ కావడంతో ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుందా.. ? ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంటుందా లేదా చూడాలి.

మంచిర్యాల, అక్టోబర్21; ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తనను చంపాలని సుపారీ గ్యాంగ్ పక్కా రాష్ట్రాల నుండి రంగంలోకి దింపారని.. జిల్లాలో అలజడి రేపి లబ్ది పొందాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ నియోజకవర్గం వర్గంలో తీవ్ర చర్చకుదారితీశాయి. ఇంతకీ ఎవరా నేత.. ఆయన చేసిన ఆరోపణల్లో నిజమెంత. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యే కం బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు పై సంచలన ఆరోపణలు చేశారు. తనను హతగయ చేసేందుకు నియోజక వర్గంలో విద్వంసం సృష్టించేందుకు.. ఎమ్మెల్యే దివాకర్ రావు ఆయన కొడుకు విజిత్ రావు కలిసి కుట్రలు పన్నారని.. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం నుంచి సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపారని సంచలన ఆరోపణలు చేశారు. మంచిర్యాల నియోజక వర్గంలో ఘర్షణలు చెలరేగేలా చేసి శవరాజకీయాలతో లబ్ది పొందాలని కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే దివాకర్ రావు పై మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ మంచిర్యాల అభ్యర్థి ప్రేంసాగర్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గమనించిన ఎమ్మెల్యే దివాకర్ రావు.. గుంటూరు, కర్నూల్ నుంచి గుండాలను తీసుకువచ్చాడని.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే వారికి రెండు నెలలుగా ఆశ్రయం ఇచ్చాడని.. వారి అడ్రస్ లతో వివరించారు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు. రానున్న ఎన్నికల్లో గొడవలు, అలజడలు సృష్టించి మంచిర్యాల జిల్లా ప్రజలను భయపెట్టేందుకు భారీ కుట్ర పన్నారని ఆరోపించారు.
రెండు రోజుల క్రితం వారి ఆచూకీ బయటపడడంతో మకాం మార్చారని… తనపై భౌతిక దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే దివాకర్ రావు పాలనలో నియోజకవర్గం లో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగాయని.. యువత మత్తుకు బానిసలు అయ్యారని ఆరోపించారు.
మంచిర్యాల లో ఈయన పాలనలో నడి రోడ్డు సుపారీ హత్యలు జరిగాయని తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు పట్టపగలు బహిరంగంగా మహిళను హత్య చేశారని.. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద మహిళను దారుణంగా హత్య చేశారని.. రియల్ ఎస్టేట్ గొడవలో ఆయన బంధువు సైతం హత్యకు గురయ్యారని.. ఇవన్నీ సుపారీ హత్యలే అని.. మరోసారి అలాంటి అలజడినే ఈ ఎన్నికల సమయంలో చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు ప్రేంసాగర్ రావు.
అయితే ప్రేంసాగర్ రావు చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే దివాకర్ రావు ఎలా స్పందిస్తారన్నది నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో చేసిన కామెంట్స్ కావడంతో ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుందా.. ? ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంటుందా లేదా చూడాలి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..