AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pneumonia: న్యుమోనియా రిస్క్ వారికి ఎక్కువ..? ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుని సంప్రదించాల్సిందే..

వాతావరణంలోని మార్పులు, గతంలో కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్లే ఇప్పుడు తెలంగాణలో న్యుమోనియా కేసులు గణనీయంగా నమోదవుతున్నట్లు చెబుతున్నారు. వాతావరణం మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు హైదరాబాద్‌లోనూ భారీగా పెరిగాయి.  చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు న్యుమోనియాతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

Pneumonia: న్యుమోనియా రిస్క్ వారికి ఎక్కువ..? ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుని సంప్రదించాల్సిందే..
Lungs Health
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 21, 2023 | 4:27 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాంతక న్యుమోనియా కేసులు బాగా పెరిగిపోయాయి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న వారు వందల సంఖ్యలో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గతంతో పోల్చితే ఈ సంవత్సరం న్యుమోనియా కేసులు బాగా పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. వీటన్నిటికీ కారణం వాతావరణంలోని మార్పులు, గతంలో కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్లే ఇప్పుడు న్యుమోనియా కేసులు గణనీయంగా నమోదవుతున్నట్లు చెబుతున్నారు. వాతావరణం మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు హైదరాబాద్‌లోనూ భారీగా పెరిగాయి.  చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పాటు న్యుమోనియాతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రతి రోజూ 1000 మందికి పైగా న్యుమోనియాతో ఆస్పత్రులకు వెళ్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్‌తో ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు.

వీరికి రిస్క్ ఎక్కువ..

ఈ సీజన్‌ లో కేసులు పెరగడానికి గల కారణాలు వాతావరణ మార్పులే అని అంటున్నారు వైద్యులు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వైరల్ ఫీవర్ బారినపడి చాలామంది ఇన్ఫెక్ట్ అవుతారని . అది కేవలం 30 నుంచి 50 రోజుల మధ్యలోనే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయని.. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా గత మూడు నెలల నుంచి కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయని చెబుతున్నారు..  దీని కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు, గతంలో కోవిడ్ ఎఫెక్ట్ అయినవారు ఇప్పుడు న్యుమోనియా బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. ఇందులో ఎక్కువగా 50 ఏళ్ల పైబడిన వారే ఎక్కువగా ఉన్నారని వైద్యులు చెప్తున్నారు. చిన్న పిల్లల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. పిల్లలు, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వీరు న్యుమోనియా బారినపడే రిస్క్ ఎక్కువగా ఉంది.

హైదరాబాద్ నగరంలో ఉన్న చెస్ట్ ఆసుపత్రికి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వారంలో 800 కి ఓపీ చేరిందని డాక్టర్లు అంటున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగిందని వైద్యులు అంటున్నారు. జస్ట్ ఆస్పత్రి లో దాదాపు 300 వరకు బెడ్స్ ఉన్నప్పటికీ నిమోనియా, ఇతర కేసుల కారణంగా ఆస్పత్రి బెడ్స్ ఫుల్ అయ్యాయని… పేషంట్ కి అందించాల్సిన చికిత్సను బట్టి గాంధీ ఉస్మానియా కి రిఫర్ చేస్తున్నామని సూపరిండెంట్ అంటున్నారు.గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మహిళల్లో కూడా నిమోనియా కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని చెస్ట్ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ అంటున్నారు.

న్యుమోనియా లక్షణాలు..

న్యుమోనియా బారినపడేవారిలో జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల నుంచి ఇది దగ్గు, తమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. కాబట్టి రోగులు మాస్కు ధరించాలని వైద్యులు తెలిపారు. న్యుమోనియా లక్షణాలు ఉంటే జనసందోహమున్న ప్రదేశాలకు వెళ్లకుండా, చల్లటి గాలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పొగతాగే అలవాటు ఉంటే ఊపిరితిత్తుల సమస్య జఠిలంగా మారే అవకాశముందని.. వెంటనే ఈ అలవాటును మానేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి ముదిరితే న్యుమోనియా ప్రాణాంతకంగా పరిణమించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం 4 రోజులైన తగ్గక పోతే వైద్యుని సంప్రదిస్తే మంచిదని లేకపోతే న్యుమోనియా మరింత ముదిరే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కాగా బెర్రీస్, ఆకు కూరలు, వాల్ నట్స్, బ్రొకోలీ, బెల్ పెప్పర్, ఆపిల్ తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

శంకర్‎కి లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నారా.? ఇంతకీ అయన ప్లాన్ ఏంటి.?
శంకర్‎కి లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నారా.? ఇంతకీ అయన ప్లాన్ ఏంటి.?
ఇందులో డిపాజిట్‌ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.4.5 లక్షల వడ్డీ..!
ఇందులో డిపాజిట్‌ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.4.5 లక్షల వడ్డీ..!
నాన్న తోపు హీరో.. అమ్మ స్టార్ హీరోయిన్.. కూతురు మాత్రం..
నాన్న తోపు హీరో.. అమ్మ స్టార్ హీరోయిన్.. కూతురు మాత్రం..
ఇరాన్‌ పోర్టు పేలుడు ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య!
ఇరాన్‌ పోర్టు పేలుడు ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య!
రోడ్డుపై కనిపించిన మామిడిపండ్లను కొంటున్నారా..? ఈ విషయం ఎరగండి...
రోడ్డుపై కనిపించిన మామిడిపండ్లను కొంటున్నారా..? ఈ విషయం ఎరగండి...
నెలకు రూ.127 ఖర్చుతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. డేటా అపరిమిత కాల్స్‌
నెలకు రూ.127 ఖర్చుతో ఏడాది పాటు వ్యాలిడిటీ.. డేటా అపరిమిత కాల్స్‌
మొన్నేఉగ్రదాడి.. ధైర్యంగా పహల్గామ్‌ను సందర్శించిన టాలీవుడ్ నటుడు
మొన్నేఉగ్రదాడి.. ధైర్యంగా పహల్గామ్‌ను సందర్శించిన టాలీవుడ్ నటుడు
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..?
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..?
రోడ్డు పక్కన పిల్లలతో క్రికెట్ ఆడుతూ కనిపించిన 100 కోట్ల హీరో
రోడ్డు పక్కన పిల్లలతో క్రికెట్ ఆడుతూ కనిపించిన 100 కోట్ల హీరో
ఇంట్లోనే ఉండి చేసే బిజినెస్‌తో లక్షల్లో లాభం.. సూపర్ బిజినెస్!
ఇంట్లోనే ఉండి చేసే బిజినెస్‌తో లక్షల్లో లాభం.. సూపర్ బిజినెస్!