AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు.. మెగాస్టార్ చిరంజీవి ..

ప్రస్తుతం టెక్నాలజీని మంచి కోసం వాడుకోవాలని.. డీప్ ఫేక్, సైబర్ నేరాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశాన్ని ఏకం చేసి మనకందించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లాంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆధర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Megastar Chiranjeevi: డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు.. మెగాస్టార్ చిరంజీవి ..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2025 | 3:25 PM

Share

భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ‘ (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (అక్టోబర్ 31న) ఉదయం ‘రన్ ఫర్ యూనిటీ’ ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అద్భుతమైన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమైక్యత, సమగ్రత మరియు భద్రతకు కట్టుబడి ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పడం జరిగింది. ఈ ‘రన్ ఫర్ యూనిటీ’ లో సుమారు 5000 మంది పౌరులు, రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా.. అలాగే శివధర్ రెడ్డి, ఐపీఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ)లు హాజరయ్యారు. వీరితో పాటు సందీప్ శాండిల్య (రిటైర్డ్ ఐపిఎస్, డైరెక్టర్ ఈగల్),యం.యం. భగవత్ ఐపిఎస్, (అడిషినల్ డిజిపి ఎల్. అండ్ ఓ తెలంగాణ), వి.సి. సజ్జనార్ (కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్), తఫ్సీర్ ఇకుబాల్ ఐపిఎస్( జాయింట్ సిపి లా ఆండ్ ఆర్డర్), డి. జోయల్ డెవిస్ ఐపిఎస్( జాయింట్ సిపి ట్రాఫిక్), కె. శిల్పావళ్ళి ఐపిఎస్( డిసిపి సెంట్రల్ జోన్), కె. అపూర్వారావు ఐపిఎస్( డిసిపి స్పెషల్ బ్రాంచ్), ధార కవిత (డిసిపి, సైబర్ క్రైమ్), లావణ్య నాయక్ జాదవ్ (డిసిపి, వుమెన్ సేఫ్టీ) ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ” ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృడ సంకల్పం, ఆయన విజన్, కార్యదీక్షత, ధైర్యం… ఇవన్నీ మనకు ఆదర్శనీయం. అటువంటి మహానుభావుడి జయంతి రోజున ‘ఏక్తా దివస్’ నిర్వహించడం ఆయనకు మనం ఇస్తున్న గొప్ప గౌరవం. 560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మన దేశం ‘వన్ నేషన్’గా ఉందంటే అది పటేల్ గారు మనకు అందించిన ఒక గొప్ప వరం. ఈ మహత్తర కృషికి మనం ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఆయన ఇచ్చిన ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ (భిన్నత్వంలో ఏకత్వం) అనే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇలా ఒక ర్యాలీ చేయడం ఇప్పుడున్న యువతకు, భావితరాలకు గొప్ప ప్రేరణ” అని అన్నారు.

“డీప్ ఫేక్ అంశాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. డీజీపీ, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎవరూ డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై ఒక చట్టం తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. అది జరగాలని కోరుకుంటున్నాను. దీంతో సామాన్యులకు సైతం రక్షణ కలిగిస్తారు. ఈ విషయంలో సామాన్యులు భయపడాల్సిన అవసరంలేదు” అని అన్నారు చిరు.

శ్రీ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ.. యవత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని తెలిపారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా, ‘డీప్ ఫేక్’ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ నేరస్థుల మూలాలపై దృష్టి సారించాము. పిల్లలు 5,000 ,10,000 కోసం సైబర్ నేరస్థులకు మ్యూల్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అన్నాపు, ఈ కార్యక్రమములో హైదరాబాదు సిటీ పోలీసు అధికారులు, సిబ్బంది అందరు పాల్గోన్నారు.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?