Telangana: వామ్మో.! గడ్డకట్టించే చలి.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి పులి చంపేస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో జనాలు గజగజ వణికిపోతున్నారు. మరి తెలంగాణ, ఏపీలో వాతావరణ వివరాలు ఇలా..

Telangana: వామ్మో.! గడ్డకట్టించే చలి.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు..
Cold Wave In Telugu States
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 13, 2024 | 11:54 AM

తెలుగు రాష్ట్రాలనూ మంచు ముంచేస్తోంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అటు దట్టమైన మంచుతో వాహనాలు, విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పొగ మంచు కురుస్తోంది. పొగమంచుతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే విమానాలు ఆలస్యం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇక మంచు ఎక్కువగా ఉండటంతో విమానాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.

అటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలికి తోడు గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో చలిపంజా విసురుతోంది. దీంతో నగర వాసులు బయటకు వచ్చేందుకు వణుకుతున్నారు.. ఉదయం 9 దాటినా చలి తీవ్రత కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
డ్రామా కింగ్ చెప్పింది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి...
డ్రామా కింగ్ చెప్పింది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి...
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!