Telangana: బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా.. అయ్యబాబోయ్.!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వన్యప్రాణులు వణికిస్తున్నాయి. చేపల వేటకు వెళ్లే జాలర్లు కూడా వెళ్లేందుకు భయపడుతున్నారు. అసలు ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

Follow us
Naresh Gollana

| Edited By: Ravi Kiran

Updated on: Dec 14, 2024 | 8:14 AM

అడవుల జిలగలా ఉమ్మడి ఆదిలాబాద్‌ను వన్య మృగాల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆసిపాబాద్ జిల్లాను నెల రోజులుగా పులుల భయం వెంటాడుతుంటే.. నిర్మల్ జిల్లాను మొసళ్ల భయం వణికిస్తోంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్ వద్ద ఏకంగా నడి రోడ్డుపై మొసలి కనిపించడంతో గజగజా వణికిపోయారు ప్రయాణికులు. అదే సమయంలో బ్యారేజ్ లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు సైతం రెండు మొసళ్లు కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. అటవిశాఖ అదికారులకు సమాచారం అందించడంతో స్థానికులను అప్రమత్తం చేశారు.

గురువారం సాయంత్రం సదర్మాట్ బ్యారేజ్‌పైన రోడ్డుపై సంచరిస్తూ ప్రయాణికుల కంటపడింది మొసలి. అప్రమత్తమైన ప్రయాణికులు స్థానికులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అటవిశాఖ అదికారులు.. బ్యారేజి లోకి మత్స్య కారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.. బ్యారేజ్‌పై వాహనదారుల ను పోలీసులు అలర్ట్ చేశారు. మొసళ్ల సంచారం; నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు అటవిశాఖ అదికారులు.. పోలీస్ సిబ్బంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి