Allu Arjun: హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. పెట్టిన కేసులు ఇవే.. ఇదిగో వీడియో
అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్. పుష్ప 2 సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంథ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
బిగ్ బ్రేకింగ్.. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప2 సినిమా సక్సెస్‌తో ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్న అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారు. సంథ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈనెల 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై, సినిమా యూనిట్ పై, థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అలాగే తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదే విషయంలో గురువారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్ వేశారు అల్లు అర్జున్. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈలోగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవంతి అనే మహిళ చనిపోయింది. అయితే ఈ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్. రేవతి గారి ఫ్యామిలీకి అల్లు అర్జున్ సంతాపం తెలియజేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి 25లక్షలు అందిస్తానని చెప్పారాయన.
నమోదైన సెక్షన్ల వివరాలు..
– 105 సెక్షన్ నాన్‌బెయిలబుల్ కేసు
– 105 సెక్షన్ కింద ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం
– BNS 118 (1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

