Vinayaka Chavithi: ల్యాంకో హిల్స్ లో మట్టి వినాయకుడి విగ్రహాల వర్క్ షాప్.. భారీగా హాజరైన చిన్నారులు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని ప్రకృతి ప్రేమికులు పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది మల్బరీ బుష్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ అనే విద్యా సంస్థ.
Vinayaka Chavithi: వినాయక చవితి వస్తుందంటే చాలు పిల్లల సందడి మొదలవుతుంది. ప్రకృతికి అర్ధం చెప్పే ఈ పండగరోజున వినాయకుడి ప్రతిమని పూజించడం ఆనవాయితీ. 10 రోజుల పూజ అనంతరం వినాయక ప్రతిమని.. గంగమ్మ ఒడికి చేరుస్తారు. గణపయ్యను నదుల్లో నిమజ్జనం చేస్తారు. అయితే రంగుల రంగుల వినాయకుడు అంటూ రసాయన విగ్రహాలు కాలుష్య కారకులుగా మారుతున్నాయి. నీరు,గాలి వాతావరణం కాలుష్యం కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని ప్రకృతి ప్రేమికులు పర్యావరణ పరిరక్షకులు కోరుతున్నారు.
అంతేకాదు సామాజిక బాధ్యత గా భావించి భావితరాలను రక్షించడం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది మల్బరీ బుష్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ అనే విద్యా సంస్థ .
హైదరాబాద్ నగరం శివారులోని ల్యాంకో హిల్స్‌లోని మల్బరీ బుష్‌లో మట్టి వినాయకుడిని తయారు చేసే వర్క్‌షాప్ ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ తయారీలో చిన్నారులకు శిక్షణ ఇచ్చింది. చిన్నారి విద్యార్థులు స్వయంగా చిట్టి చిట్టి చేతులతో బొజ్జగణపయ్యలను తయారు చేశారు.
ఈ వర్క్ షాప్ లో సుమారు 200 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. బంక మన్నుతో స్వయంగా వినాయక విగ్రహాలను తయారు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..