Hyderabad: వామ్మో పగటిపూటే ఎంతకు తెగించారు.. వీళ్లు దొంగలు కాదు.. దేశముదుర్లు
దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే ఇళ్లకు కన్నాలు వేస్తున్నారు. టెక్నాలజీ పెరిగినా.. తప్పించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేశిస్తున్నారు.
Telangana: దొంగలు రోజురోజుకు ఇస్మార్ట్ అవుతున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా.. తమ మార్గాలు తమకు ఉంటాయని నిరూపించి చూపిస్తున్నారు. ఇంతకుముందులా రాత్రుళ్లు కాదు… డే టైమ్స్‌లో కూడా చోర విద్యను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆశ్చర్యం కలిగించే చోరీ ఒకటి హైదారాబాద్ శివారులో వెలుగుచూసింది. చోరీ చేసిన తీరును చూసి పోలీసులే స్టన్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్(Moinabad)కు చెందిన కంజర్ల సువర్ణ అనే మహిళ.. ఆగస్టు 30(మంగళవారం) సాయంకాలం 4 గంటల సమయంలో కాయగూరలు తెచ్చేందుకు.. మార్కెట్‌కు వెళ్లింది. వెళ్లే ముందు ఇంటి మొయిన్ గేటుకు తాళం వేసింది. అయితే దొంగలు.. ఏకంగా ఇటుకలతో కట్టిన ఆ ఇంటి గోడకే కన్నం పెట్టి.. లోపలికి ప్రవేశించారు. బీరువా ధ్వంసం చేసి.. లోపల లాకర్‌లో ఉన్న 6 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. సువర్ణ ఇంటికి వచ్చేసరికి.. గోడకు కన్నం ఉండటం చూసి స్టన్ అయ్యింది. లబోదిబోమంటూ చుట్టుపక్కల వాళ్లకు విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. క్లూస్ టీమ్ అక్కడికి వచ్చి ఫింగర్ ప్రింట్స్ సేకరించింది. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..