Khairatabad Ganesh: తొలి పూజను అందుకున్న ఖైరతాబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి.. తొలిసారి మట్టి ప్రతిమ ఏర్పాటు
ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులకు రిక్వెస్ట్ చేసినందున ఈ సంవత్సరము నగరంలో మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు నగర మేయర్.
Khairatabad Ganesh: భాగ్యనగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. వీధి వీధిలోనూ గణేష మండపాలు కొలువుదీరాయి. అనేక రూపాల్లో గణపతి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పర్వదినం అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి గా కొలువుదీరిన గణపతికి వినాయక చవితి పూజలను ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ఇరువైపులా త్రిశక్తి మహా గాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనమీతో దర్శనం ఇస్తున్నారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులకు రిక్వెస్ట్ చేసినందున ఈ సంవత్సరము నగరంలో మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను మాత్రమే ఉపయోగించాలని పర్యావరణ హితానికి తోడ్పడాలి అన్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..