Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ నుంచే టికెట్ బుకింగ్స్.. ఇలా చేస్తే సరి..

ఈ సరికొత్త సర్వీస్ హైదరాబాద్ మెట్రో రైల్‌లో నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్ నంబర్‌లో ఈ-టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ నుంచే టికెట్ బుకింగ్స్.. ఇలా చేస్తే సరి..
Hyderabad Metro
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2022 | 10:00 AM

ఈకో ఫ్రెండ్లీ ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ మరో కీలక అడుగు వేసింది. ఇప్పటి వరకు ఉన్న టికెట్ వ్యవస్థలో పలు మార్పలు చేసింది. దీంతో ఇకపై మీ వాట్సాప్ నుంచే టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. ఈ-టికెటింగ్ సౌకర్యం ద్వారా ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్డ్ మెట్రో టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది.

దేశంలోనే మెట్రో రైల్ వాట్సాప్ టికెటింగ్ ప్రారంభించడం ఇదే తొలిసారి అని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ అండ్ టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైల్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం సింగపూర్‌లోని Billeasy, AFC భాగస్వామి ShellinfoGlobalsgతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ సరికొత్త సర్వీస్ హైదరాబాద్ మెట్రో రైల్‌లో నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఇప్పుడు తమ వాట్సాప్ నంబర్‌లో ఈ-టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ టికెట్లను ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల వద్ద స్కాన్ చేసి హాయిగా జర్నీ చేయవచ్చు. ఈ సౌకర్యం టిక్కెట్ బుకింగ్ ఇతర డిజిటల్ మోడ్‌లకు అంటే టీ సవారీ, పేటీఎం లాంటి ఇతర ఆఫ్షన్స్ కు అదనంగా నిలవనుంది.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ఎల్‌అండ్‌టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్‌ ఎండి, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్‌ మెట్రో రైలు డిజిటలైజేషన్‌ మార్పులను ఎల్లప్పుడూ స్వాగతిస్తోంది. డిజిటల్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా, మా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, మా సేవా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి పూర్తి డిజిటల్ చెల్లింపు గేట్‌వేతో భారతదేశపు మొట్టమొదటి మెట్రో వాట్సాప్ ఇ-టికెటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది” అంటూ తెలిపారు.

వాట్సాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రక్రియ:

  1. హైదరాబాద్ మెట్రో రైల్ ఫోన్ నంబర్ 918341146468కి ‘హాయ్’ సందేశాన్ని పంపడం ద్వారా WhatsApp చాట్‌ని ప్రారంభించండి లేదా మెట్రో స్టేషన్‌లలో అందుబాటులో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.
  2. ఆ తర్వాత OTP, ఇ-టికెట్ బుకింగ్ URL మెసేజ్ రూపంలో వస్తుంది.
  3. ఆ తర్వాత E-టికెట్ గేట్‌వే వెబ్‌పేజీని తెరిచి eTicket బుకింగ్ URLని క్లిక్ చేయాలి.
  4. అనంతరం జర్నీ రూట్ & జర్నీ టైప్ ఎంపికలను ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమేంట్ చేయాలి. (Gpay, PhonePe, Paytm & Rupay డెబిట్ కార్డ్ మొదలైనవి)
  5. అనంతరం రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్‌లో మెట్రో ఇ-టికెట్ QR కోడ్ వస్తుంది.
  6. AFC గేట్ వద్ద QR E-టికెట్‌ను స్కాన్ చేసి, హాయిగా జర్నీ చేయవచ్చు.