Hyderabad LB Stadium: ఎల్బీ స్టేడియంలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దొంగలు పడ్డారు. విలువైన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారు. అవుతును, ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో..
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో దొంగలు పడ్డారు. విలువైన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారు. అవుతును, ఎల్బీ స్టేడియంలోని తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో చోరీ జరిగింది. ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ ఈ చోరీని ధృవీకరించారు. సోమవారం నాడు ఉదయం కార్యాలయాన్ని క్లీన్ చేసేందుకు సిబ్బంది వచ్చారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీకి ఫోన్ చేసి విషయం చెప్పారు.
ఆఫీసుకు చేరుకున్న ఆయన.. కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ చాలా విలువైన వస్తువలన్నీ కనిపించలేదు. దాంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. కార్యాలయంలో ఉన్న రూ. 50 వేల విలువ చేసే ట్రోపీలు, రూ. 10 వేలు విలువ చేసే ప్లేయర్స్‌కి సంబంధించిన కిట్లు దుండగులు దోచుకెళ్లినట్లు పాల్గుణ వెల్లడించారు. వెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
అయితే, నగరం నడిబొడ్డున, చుట్టూ ప్రభుత్వ కార్యలయాలు, పోలీసు కార్యాలయాలు, భారీ భద్రత ఉండే ఎల్బీ స్టేడియంలోనే ఈ చోరీ జరుగడం సంచలనం రేపుతోంది.
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..