- Telugu News Photo Gallery Cricket photos Ind vs sa odi team selection rajat patidar mukesh kumar new players in Indian cricket team ODI Squad against south africa
IND vs SA: ఒకరు బ్యాటింగ్.. మరొకరు బౌలింగ్‌తో బీభత్సం.. టీమిండియాలో దక్కిన చోటు..
సీనియర్ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌నకు వెళ్లేందుకు సిద్ధమవడంతో.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ చాలా మంది ఆటగాళ్లకు మంచి అవకాశంగా మారింది. ఇందులో ఇద్దరికి మాత్రం అరంగేట్రం చేసే అవకాశం దక్కింది.
Updated on: Oct 03, 2022 | 7:15 AM

భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ ఇంకా పూర్తి కాలేదు. అయితే త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అక్టోబర్ 2 ఆదివారం నాడు శిఖర్ ధావన్ సారథ్యంలోని మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఇందులో ఇద్దరు ఆటగాళ్లు మొదటిసారి ODI జట్టులో చోటు దక్కించుకున్నారు.

రజత్ పాటిదార్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీతో సహా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అతను ఒకడు. దీనితో పాటు అతను ఐపీఎల్‌లో బెంగళూరు తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇది కాకుండా, ఇటీవల ఇండియా ఏ వర్సెస్ న్యూజిలాండ్ ఏతో రెండు వన్డేలు కూడా ఆడాడు. పాటిదార్ ఇప్పటివరకు 45 లిస్ట్ A (ODI) మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు 35 సగటుతో 1462 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి.

ముఖేష్ కుమార్: బెంగాల్‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచిన ముఖేష్.. ఇటీవల న్యూజిలాండ్ ఏతో జరిగిన మూడు టెస్టుల్లో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ముఖేష్ వన్డే కెరీర్ అంత పెద్దది కాదు. 18 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఇరానీ కప్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు.

వీరితో పాటు షాబాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇటీవల జింబాబ్వే పర్యటనలో కూడా జట్టుతో ఉన్నారు. కానీ, వారికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.





























