AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్‌కు బానిసగా మారిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు.. పోలీసుల జోక్యంతో చివరకు ఇలా..

వీరిని కష్టడికి తీసుకొని కన్జ్యూమర్ల వివరాలు రాబడతామని ఆయన తెలిపారు. 100 గ్రాములకు పైబడి డ్రగ్స ను పట్టిస్తే రివార్డు ప్రకటిస్తామని ఇది వరకే హైదరాబాద్ సిపి స్పష్టం చేశారు. ఈ కేసులో సుమారు 250 గ్రాముల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు హైదరాబాద్ కొత్వాల్ 3 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ డిసిపి సుదీంద్రా కు ఈ రివార్డును అందజేయనున్నారు.

డ్రగ్స్‌కు బానిసగా మారిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు.. పోలీసుల జోక్యంతో చివరకు ఇలా..
Drugs Seized Hyderabad Poli
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Aug 14, 2024 | 9:09 PM

Share

స్పోర్ట్స్ వీసా మీద నైజీరియా నుండి భారత్‌కు వచ్చాడు ఫ్రాంక్. కొన్ని సంవత్సరాల పాటు ఫుట్బాల్ ఆడిన ఫ్రాంక్ తనకు వస్తున్న ఆదాయం సరిపోవడంలేదని ఆవేదనకు గురయ్యాడు. 2018 వరకు ఢిల్లీలోని ఆల్ స్టార్స్ ఆఫ్రికా క్లబ్ తరఫున ఫుట్బాల్ ఆడాడు. నెలల తరబడి ఫుట్బాల్ ఆడుతున్న తన సంపాదన ఏమాత్రం పెరగకపోవడంతో డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఢిల్లీ నుండి బెంగళూరుకి మకాం మార్చిన ఫ్రాంక్ అక్కడ ఉన్న మరో నైజీరియన్ ద్వారా డ్రగ్స్ మాఫియాలోకి దిగాడు.

ఇటీవల నైజీరియన్ ముఠా మొత్తం హైదరాబాద్ విడిచి బెంగళూరులో స్థిరపడ్డారు. బెంగళూరు కేంద్రంగా మొత్తం ఆగడాలు సాగిస్తుంది ఈ ముఠా. బెంగళూరు నుండి హైదరాబాదులో ఉన్న డ్రగ్స్ కన్జ్యూమర్లకు పార్సెల్ లేదా డెలివరీ ఏజెంట్ ద్వారా డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ కు చెందిన అస్సాన్ ఖాన్ తోపాటు ఆయన సోదరుడు సైఫ్ ఖాన్ ఈ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారు. మొదట డ్రగ్స్ కు బానిసగా మారిన అసాన్ ఖాన్ మెల్లమెల్లగా డ్రగ్ సరఫరాదారుడుగా మారిపోయాడు. డార్క్ వెబ్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న అసాన్ ఖాన్ కు నైజీరియన్ ఫ్రాంక్ పరిచయమయ్యాడు.

బెంగళూరు నుండి వస్తున్న డ్రగ్స్ను హైదరాబాదులో ఉన్న కన్జ్యూమర్ లకు చేరవేసే బాధ్యతను సైఫ్ ఖాన్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ సార్వి హోటల్ వద్ద ఓ కస్టమర్ కు డ్రగ్స్ అమ్ముతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే రైడ్ నిర్వహించారు. ముగ్గురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి వద్ద నుండి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

సుమారు 1. కోటి 10 లక్షలకు పైగా విలువ చేసే డ్రగ్స్ను వీరి వద్ద లభ్యమయ్యాయి.. వీటిలో కోకైన్ హెరాయిన్ ఎండిఎంఏ లాంటి మత్తు పదార్థాలు ఉన్నట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీరిని కష్టడికి తీసుకొని కన్జ్యూమర్ల వివరాలు రాబడతామని ఆయన తెలిపారు. 100 గ్రాములకు పైబడి డ్రగ్స ను పట్టిస్తే రివార్డు ప్రకటిస్తామని ఇది వరకే హైదరాబాద్ సిపి స్పష్టం చేశారు. ఈ కేసులో సుమారు 250 గ్రాముల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు హైదరాబాద్ కొత్వాల్ 3 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ డిసిపి సుదీంద్రా కు ఈ రివార్డును అందజేయనున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..