AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth on Investments: హైదరాబాద్‌ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయా..? సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంతోనే హైదరాబాద్‌కి పోటీ.. దేశంలో మరే రాష్ట్రాలు రావని, హైదరాబాద్‌కి సాటి లేదని సీఎం అన్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ నిలుస్తుందని చెప్పారు. అంచనాలకు అందని కంపెనీలు భాగ్యనగరం బాట పడుతున్నాయన్నారు.

Cm Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Aug 15, 2024 | 7:22 AM

Share

తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంతోనే హైదరాబాద్‌కి పోటీ.. దేశంలో మరే రాష్ట్రాలు రావని, హైదరాబాద్‌కి సాటి లేదని సీఎం అన్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ నిలుస్తుందని చెప్పారు. అంచనాలకు అందని కంపెనీలు భాగ్యనగరం బాట పడుతున్నాయన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ వస్తున్న అపోహలను కొట్టిపారేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కాగ్నిజెంట్ కొత్తక్యాంపస్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్‌ నుంచి ఏపీ, కర్నాటకకు పెట్టుబడులు వెళతాయనే ప్రచారంలో నిజంలేదన్నారు సీఎం రేవంత్. తమకు పక్క రాష్ట్రాలతో పోటీ కాదని ప్రపంచంతో అని తెలిపారు. 430 ఏళ్లుగా హైదరాబాద్ నగరం ఎదుగుతూ వచ్చిందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్‌ నగరంలో ఉన్న మౌలిక వసతులు, శాంతిభద్రతలు పక్కరాష్ట్రాల్లో లేవన్నారు. హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అయ్యే ఇన్‌ఫ్రాస్ట్రచర్ ఉందన్నారు. పెట్టుబడిదారుల భద్రతకు తమ ప్రభుత్వం బాధ్యత వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

15రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31వేల 500కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమన్న సీఎం.. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్‌గా మారనుందన్నారు. అమెరికా, సియోల్‌లో కాగ్నిజెంట్ ఆఫీసులు సందర్శించామన్నా సీఎం.. కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య లక్షకు పెరగాలని ఆకాంక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..

35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?

16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?

జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో

రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా

మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే

భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?

సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్

నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..

ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..