AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్నేహమంటే ఇదేరా.. ఆప్తుడి కుటుంబానికి అండగా నిలిచిన పదో తరగతి ఫ్రెండ్స్‌

మరీ ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులు జీవితాంతం గుర్తుంటారు. స్నేహం అంటే కేవలం స్కూలు, కాలేజీ దాటే వరకే కాదు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత కూడా తోడుంటుందని చాటి చెప్పారు కొందరు స్నేహితులు. తమ చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి వచ్చిన కష్టంలో అండగా నిలిచారు. పుష్కరం క్రితం పదో తరగతి కలిసి చదువుకున్నారు...

Telangana: స్నేహమంటే ఇదేరా.. ఆప్తుడి కుటుంబానికి అండగా నిలిచిన పదో తరగతి ఫ్రెండ్స్‌
Telangana
P Shivteja
| Edited By: |

Updated on: Aug 15, 2024 | 8:02 AM

Share

‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’.. ఇది ఓ సినిమాలో పాపుల్‌ సాంగ్‌. ఈ సృష్టిలో ప్రతీ బంధాన్ని ఆ దేవడే నిర్ణయిస్తారు. అయితే ఒక్క స్నేహితులను మాత్రం మనమే ఎంచుకుంటాం. కేవలం సంతోషంలోనే కాదు, కష్టాల్లోనూ తోడుండే వాడే స్నేహితుడు. ఏ బంధంలో అయినా స్వార్థం ఉంటుండొచ్చు కానీ స్నేహంలో మాత్రం ఎలాంటి స్వార్థాలు ఉండవని చెబుతుంటారు.

మరీ ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులు జీవితాంతం గుర్తుంటారు. స్నేహం అంటే కేవలం స్కూలు, కాలేజీ దాటే వరకే కాదు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తర్వాత కూడా తోడుంటుందని చాటి చెప్పారు కొందరు స్నేహితులు. తమ చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి వచ్చిన కష్టంలో అండగా నిలిచారు. పుష్కరం క్రితం పదో తరగతి కలిసి చదువుకున్నారు. అలా చదువుకున్న వారిలో ఒకరు చనిపోయిన వార్త విని చలించిపోయారు…తమ స్నేహితుని కుటుంబానికి మేమున్నామనే భరోసా కల్పించాలనుకున్నారు.

అంతా కలిసి ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.. వివరాల్లోకి వెళితే..కొండపాక మండలం మర్పగడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన అబంటి యాదగిరి వ్యక్తిని సహచర విద్యార్థులు అతని కుమార్తె ఖాతాలో రూ.90,516 జమ చేసి ఆదుకున్నారు… అంబటి యాదగిరి (40) నెల రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న సహవిద్యార్థులు ఆ మొత్తాన్ని సేకరించి బుధవారం యాదగిరి కుమార్తె పోస్టల్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇలా స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..