Hyderabad Lok Sabha Elections: ఓల్డ్ సిటీలో ఓటర్ల ఆధార్‌ను చెక్ చేసిన మాధవీలత.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను సందర్శిస్తూ స్వయంగా ఐడీ కార్డులు తనిఖీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Hyderabad Lok Sabha Elections: ఓల్డ్ సిటీలో ఓటర్ల ఆధార్‌ను చెక్ చేసిన మాధవీలత.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
Madhavi Latha
Follow us

|

Updated on: May 13, 2024 | 1:35 PM

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను సందర్శిస్తూ స్వయంగా ఐడీ కార్డులు తనిఖీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నియోజకవర్గంలోని పలు బూత్ లను సందర్శిస్తున్న మాధవీలత.. ముస్లిం మహిళల బురఖాను తొలగించాలంటూ కోరుతూ అక్కడున్న వారిని తనిఖీ చేశారు. అంతేకాకుండా వారి ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు కూడా చెక్ చేశారు. ఓటు వేయడానికి వచ్చిన మహిళల పేర్లను అడుగుతూ కనిపించారు.

మాధవీలత వీడియో..

ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పోలింగ్ విషయంలో అప్రమత్తత అవసరం అన్నారు. నియోజకవర్గంలో కొందరిని ఓటు వేయకుండా చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు చురుగ్గా లేరని.. ఎవ్వరినీ విచారించడం లేదు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడికి వస్తున్నప్పటికీ వారి పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. చనిపోయినవారి పేర్లతోనూ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. అజంపుర, గోషామహల్‌లో అక్రమాలపై ఈసీకి కంప్లైంట్ చేస్తామన్నారు మాధవీలత..

మాధవీలతపై కేసు నమోదు..

పోలింగ్ స్టేషన్ లో ముస్లిం మహిళా నకాబ్ తొలగించి పరిశీలించిన హైదరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చే చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు.

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

కాగా.. బిజెపి అభ్యర్థి మాధవి లత ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీని గురించి మీడియా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. తాను వీడియో చూడలేదని.. కానీ బిజెపి కేవలం ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇలా చేయడం వల్ల అసదుద్దీన్‌ ఒవైసీకి సాయం చేయడమేనని.. దాని వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..