South Central Railway: పోలింగ్ సందర్భంగా ఏపీ- తెలంగాణ మధ్య ప్రత్యేక రైళ్లు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల జాతర కొనసాగుతోంది. అయితే తెలంగాణలో కేవలం లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికి పోలింగ్ కొనసాగుతోంది. ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ ప్రజలు హైదరాబాద్..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల జాతర కొనసాగుతోంది. అయితే తెలంగాణలో కేవలం లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికి పోలింగ్ కొనసాగుతోంది. ఏపీకి చెందిన చాలా మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏపీ ప్రజలు హైదరాబాద్ నుంచి ఏపీకి రెండు రోజుల ముందు నుంచే బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్టీసీతో పాటు రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఓటు హక్కు వినియోగించుకునే ఏపీ ప్రజల కోసం ప్రత్యేక రైళ్లతో పాటు కొన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను సైతం ఏర్పాటు చేసింది రైల్వే.
రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నగరంలోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లంతా సొంతూళ్లకు వెళ్లారు. మిగతా వారు కూడా ఊళ్లకు వెళ్లడానికి రైళ్లు, బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే చాలా మందికి టికెట్లు దొరకలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మే 10వ తేదీ నుంచే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు 14వ తేదీ వరకు పలు మార్గాల్లో రైళ్లలో అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్ లు ఉన్నాయి. ఈ రైల్వే సర్వీసులన్నీ ఏపీ- తెలంగాణ మధ్యే నడుస్తున్నాయి.
13, 14 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అలాగే హైదరాబాద్-విశాఖ మధ్య పలు ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లతోపాటు మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి