AP-Telangana Election 2024 LIVE: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. రికార్డ్ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదు

|

Updated on: May 13, 2024 | 9:53 PM

Andhra Pradesh and Telangana Election 2024 LIVE Updates in Telugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నగరాల నుంచి గ్రామాల వరకు అన్ని కోట్ల ఎలక్షన్‌ జోష్‌ కన్పిస్తోంది. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు భారీ సంఖ్యలో వస్తుండటంతో చాలా ప్రాంతాల్లో క్యూలైన్లు కనిపిస్తున్నాయి.

AP-Telangana Election 2024 LIVE: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. రికార్డ్ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదు
Elections 2024

Lok Sabha Poll 2024 Phase 4 Voting Live News Updates in Telugu: ఎన్నికల రణక్షేత్రంలో కీలక ఘట్టం ప్రారంభమైంది.. నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది.. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు జనం పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనం.. నేతల భవితవ్యాన్ని EVMలలో నిక్షిప్తం చేయనున్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. పోలింగ్‌ బూత్‌లలో సకల సదుపాయాలూ కల్పించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలై.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అయితే, . మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 12 వేల 438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను సాఫీగా పూర్తిచేసేందుకు 5 లక్షల 26 వేల మంది సిబ్బందిని ఈసీ వినియోగిస్తోంది. ఇందులో 3 లక్షల 30 వేల మంది పోలింగ్ విధుల్లో, లక్షా 6 వేల మంది బందోబస్తులో పాల్గొంటారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ మధ్యే ముగియగా.. ఇవాళ ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 50 మంది మహిళలు ఉన్నారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో 45 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మెదక్‌ ఎంపీ సీటులో 44 మంది అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ బరిలో అత్యల్పంగా 12 మంది మాత్రమే బరిలో ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల 32 వేల మంది ఓటర్లున్నారు. యువ ఓటర్లు 9 లక్షల 20 వేల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 9 వేల 900 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ బందోబస్తు కోసం 164 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. 73 వేల 414 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 May 2024 08:25 PM (IST)

    ఏపీలో రాత్రైనా కొనసాగుతున్న పోలింగ్

    – కుప్పం నియోజకవర్గంలో 30కి పైగా బూత్ లలో ఓటర్ల బారులు

    – రాత్రి పదింటి వరకు ఓటింగ్ జరుగుంతుందంటున్న అధికారులు

    – పూతలపట్టు మండలం వడ్డేపల్లి, ఐరాల మండలం కాణిపాకంలో ఓటర్ల క్యూ

    – కాకినాడ జిల్లాలోనూ కొన్నిచోట్ల కొనసాగుతున్న పోలింగ్

    – తుని మండలం తాళ్లూరులో కరెంట్ లేక పోలింగ్ కి అంతరాయం

    – పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో మొరాయిస్తున్న ఈవీఎంలు

    – ఈవీఎంల మొరాయింపుతో క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్న ఓటర్లు

    – గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో క్యూలైన్లలోనే ఓటర్లు

  • 13 May 2024 08:04 PM (IST)

    పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందిః డీజీపీ రవి గుప్తా

    తెలంగాణ లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందిః రవి గుప్తా, తెలంగాణ డీజీపీ

    మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా సాగింది

    ఎక్కడ హింసత్మక ఘటనలు చోటు చేసుకోలేదు

    పాతబస్తి లో పరిస్థితి అదుపులో ఉంది

    మాధవిలతపై 2, రాజాసింగ్‌పై ఒక కేసు నమోదు చేశాంః రవి గుప్తా, తెలంగాణ డీజీపీ

  • 13 May 2024 07:57 PM (IST)

    నాగర్ కర్నూల్ జిల్లాలో ఓటర్లపై తేనెటీగలు దాడి

    అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామంలో ఓటర్లపై తేనెటీగలు దాడి.

    పోలింగ్ బూత్‌కు సమీపంలో ఉన్న ఓటర్లపై తేనెటీగలు దాడి.

    తేనెటీగ దాడితో ఒక్కసారిగా పరుగులు తీసిన ఓటర్లు.

    సుమారు 25 మందికి గాయాలు.. గాయపడ్డవారిని స్థానిక పీహెచ్‌సీలో చికిత్స.

    తీవ్రంగా గాయపడ్డ కొంతమందిని అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు.

  • 13 May 2024 07:19 PM (IST)

    పిఠాపురం పోలింగ్ బూత్‌లో కరెంట్ కష్టాలు

    పిఠాపురం 153 వ బూత్ లో కరెంటు లేదని నిరసన

    ఎమ్మెల్యే ఈవీఎంలు చీకట్లో నా అంటూ సామాజిక కార్యకర్తలు ఆందోళన

    ఈవీఎంలో గుర్తులు కనిపించడం లేదని అధికారులను ప్రశ్నిస్తున్న స్థానికులు

  • 13 May 2024 07:07 PM (IST)

    హైదరాబాద్‌‌కు వచ్చే దారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

    హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా పెరిగిన ట్రాఫిక్ రద్దీ

    ఏపీ నుంచి తిరిగివస్తున్న ఓటర్లతో పెరిగిన వాహనాల రద్దీ

    చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ

    ఏపీతోపాటు కోదాడ, ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో తిరిగి వస్తున్న ఓటర్లు

  • 13 May 2024 07:05 PM (IST)

    తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌ మీడియా సమావేశం

    తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ముగిసిన పోలింగ్‌ సమయం

    సాయంత్రం 7 గంటలకు మీడియాతో మాట్లాడనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌

  • 13 May 2024 07:03 PM (IST)

    చీమలమరిలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

    పల్నాడు జిల్లా చీమలమరిలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

    — పోలింగ్ కేంద్రం సమీపంలో రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

    — చేతులెత్తేసిన పోలీసులు, ఆగిపోయిన పోలింగ్‌

    — పదిమందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    — భయాందోళనలో చీమలమరి గ్రామస్తులు

  • 13 May 2024 07:01 PM (IST)

    లారీ దెబ్బలకి సొమ్మసిల్లిన యువకులు..

    తిరుపతి దొడ్డపురంలో దొంగ ఓటర్లని పట్టుకున్న పోలీసులు.

    దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను పట్టుకున్న సీఆర్పీఎఫ్ పోలీసులు

    లారీ దెబ్బలకి సొమ్మసిల్లిన యువకులు..

    దొంగ ఓటర్లకు నీళ్ళు తాగించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది.

  • 13 May 2024 06:57 PM (IST)

    పల్నాడులో నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో దాడులు

    -పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో ఉద్రిక్తత

    -వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

    -నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో దాడులు

    -రెవెన్యూ సిబ్బంది బైక్‌ దగ్ధం

    -చీమలమర్రి గ్రామంలో ఉద్రిక్తత

    -పరస్పరం రాళ్లు రువ్వుకున్న టీడీపీ వైసీపీ కార్యకర్తలు

    -10 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    -చీమలమర్రి గ్రామంలో నిలిచిపోయిన పోలింగ్‌

  • 13 May 2024 06:30 PM (IST)

    తెలంగాణలో సా. 5 గంట‌ల వ‌ర‌కు 61.16 శాతం పోలింగ్

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని నియోజ‌క‌ వ‌ర్గాల ప‌రిధిలో ఓట‌ర్లు ఉత్సాహంతో ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు.. తెలంగాణ‌ లోని 17 పార్లమెంట్ నియోజ‌క‌ వ‌ర్గాల్లో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 61.16 శాతం పోలింగ్ న‌మోదైంది..

    ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 69.81 శాతం

    భువ‌న‌గిరి – 72.34 శాతం

    చేవెళ్ల – 53.15 శాతం

    హైద‌రాబాద్‌ -39.17 శాతం

    క‌రీంన‌గ‌ర్‌ – 67.67 శాతం

    ఖ‌మ్మం – 70.76 శాతం

    మ‌హ‌బూబాబాద్‌ – 68.60 శాతం

    మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ – 68.40 శాతం

    మ‌ల్కాజ్‌గిరి – 46.27 శాతం

    మెద‌క్‌ – 71.33 శాతం

    నాగ‌ర్‌ క‌ర్నూల్‌ – 66.53 శాతం

    న‌ల్లగొండ‌ – 70.36 శాతం

    నిజామాబాద్‌ – 67.96 శాతం

    పెద్దప‌ల్లి – 63.86 శాతం 1 సికింద్రాబాద్‌ – 42.48 శాతం

    వ‌రంగ‌ల్‌ – 64.08 శాతం

    జ‌హీరాబాద్‌ – 71.91 శాతం

  • 13 May 2024 06:26 PM (IST)

    హైదరాబాద్‌లో ఆసక్తికర పరిణామం

    పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఎదురుపడ్డారు. ఈ ఘటన మీర్‌పేట్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఎటూ కదలనీయకుండా కార్యకర్తలు ఇద్దరు అభ్యర్థుల వాహనాలు చుట్టుముట్టారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్థుల వాహనాలను అక్కడ నుంచి పంపించివేశారు.

  • 13 May 2024 06:01 PM (IST)

    జూబ్లీహిల్స్‌‌లో ఓటు వేసిన మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు

    జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌లో ఓటేశారు మై హోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు. యువత ఓటింగ్‌కు దూరంగా ఉండడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. ఓటు వేసినప్పుడు మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చైతన్యం పట్టణ ప్రాంతాల్లో లేకపోవడంతో ఓటింగ్‌ శాతం తగ్గుతోందని ఆయన అన్నారు.

  • 13 May 2024 05:56 PM (IST)

    ఏపీలో సాయంత్రం 5 గంటలకు 67.99 శాతం పోలింగ్

    లోక్ ఎన్నికలకు నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 62.31 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో 67.99 శాతం, తెలంగాణలో 61.16 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా జీడీ నెల్లూరులో 79.90 శాతం, అత్యల్పంగా కురుపాంలో 52 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీ లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా చిత్తూరులో 75.60 శాతం, అత్యల్పంగా అరకులో 58.20 శాతం ఓటింగ్ నమోదూ అయ్యింది.

    అల్లూరి సీతారమరాజు – 55.17 అనకాపల్లి – 65.97 అనంతపురం – 68.04 అన్నమయ్య – 67.63 బాపట్ల 72.14 చిత్తూరు – 74.06 అంబేద్కర్ కోనసీమ -73.55 ఈస్ట్ గోదావరి – 67.93 ఏలూరు – 71.10 గుంటూరు – 65.58 కాకినాడ – 65.01 కృష్ణ జిల్లా – 73.53 కర్నూలు – 64.55 నంద్యాల – 71.43 ఎన్టీఆర్ జిల్లా – 67.44 పల్నాడు – 69.10 పార్వతీపురం మన్యం – 61.18 ప్రకాశం – 71.00 నెల్లూరు – 69.95 సత్యసాయి జిల్లా – 67.16 శ్రీకాకుళం – 67.48 తిరుపతి – 65.88 విశాఖ – 57.42 విజయనగరం – 68.16 వెస్ట్ గోదావరి – 68.98 వైయస్ఆర్ జిల్లా – 72.85

  • 13 May 2024 05:50 PM (IST)

    ఆర్మీ హెలికాప్టర్‌తో స్ట్రాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలు, వీవీప్యాట్‌

    అల్లూరి జిల్లాలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఆర్మీ హెలికాప్టర్‌తో స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఏజెన్సీలోని రంపచోడవరం నియోజకవర్గంలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలైన వై రామవరం మండలంలోని.. గుర్తేడు, పాతకోట, బొడ్డగండి పోలింగ్ కేంద్రాల నుంచి హెలికాప్టర్‌తో రంపచోడవరానికి ఈవీఎంలు తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను తీసుకొచ్చారు ఎన్నికల అధికారులు.

  • 13 May 2024 05:47 PM (IST)

    విజయవాడ పోరంకి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత

    విజయవాడ పోరంకి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు.. వైసీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగడంతో.. ఓటర్లు భయంతో పరుగులు తీశారు. TDP అభ్యర్థి బోడె ప్రసాద్ సమక్షంలో దాడులకు దిగారని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతల దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అభ్యర్థి జోగి రమేష్. దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • 13 May 2024 05:02 PM (IST)

    విశాఖ వెళ్లే ట్రైన్‌లో ప్రయాణికుల ఆందోళన

    ఊరేళ్లి ఎన్నికల్లో ఓటేద్దామని రైలుఎక్కిన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. నాందేడ్‌- విశాఖ ట్రైన్‌. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఉదయమే విశాఖ చేరుకోవాల్సిన ట్రైన్‌..9 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. దీంతో సాయంత్రానికి కూడా ఆ రైలు విశాఖకు చేరుకునే సూచనలు కనిపించడం లేదు. సాయంత్రం ఆరు వరకే ఓటువేసేందుకు అవకాశం ఉండడంతో తాము ఓటువేసే అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులోని ప్రయాణికులు. ఎన్నికల సంఘం స్పందించి గంట ఆలస్యమైనా తమకు ఓటువేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు ప్రయాణికులు.

  • 13 May 2024 04:52 PM (IST)

    నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత

    గుంటూరు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులపైకి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.

  • 13 May 2024 04:26 PM (IST)

    జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన రామ్, చరణ్ ఉపాసన

    సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన నతీమణి ఉపాసన‌తో కలిసి ఓటు వేశారు. జూబ్లీ క్లబ్ పోలింగ్ స్టేషన్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. అందరూ బయటకి వచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఓటు బరువు కాదు బాధ్యత అన్నారు. ఇళ్ళల్లో ఉన్న యువత బయటకు వచ్చి ఓటేయాలని కోరారు.

  • 13 May 2024 04:00 PM (IST)

    తెలంగాణలో మ.3 గం.ల వరకు నమోదైన పోలింగ్ శాతం

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదు.

    అదిలాబాద్ -62.44 భువనగిరి -62.05 చేవెళ్ల -45.35 హైద్రాబాద్ -29.47 కరీంనగర్-58.24 ఖమ్మం-63.67 మహబూబాబాద్-61.40 మహబూబ్నగర్-58.92 మల్కాజిగిరి-37.69 మెదక్-60.94 నాగర్ కర్నూల్ -57.17 నల్గొండ-59.91 నిజామాబాద్-58.70 పెద్దపల్లి-55.92 సికింద్రబాద్-34.58 వరంగల్-54.17 జహీరాబాద్-63.96

    సికింద్రబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ..39.92

  • 13 May 2024 03:59 PM (IST)

    ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ ఇవే

    ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్

    కడపలో : 60.57 శాతం

    చిత్తూరులో : 64.64 శాతం

    బాపట్లలో : 59.49 శాతం

    అల్లూరిలో : 48.87 శాతం

    అనకాపల్లిలో : 53.45 శాతం

    అనంతపురంలో : 54.25 శాతం

    అన్నమయ్యలో : 54.44 శాతం

    కృష్ణాలో : 59.39 శాతం

    కోనసీమలో : 59.73 శాతం

    నంద్యాలలో : 59.30 శాతం

    విశాఖపట్నంలో : 46.21 శాతం

    ఏలూరులో : 57.14 శాతం

    పశ్చిమ గోదావరి జిల్లాలో : 54.60 శాతం

    నెల్లూరులో : 58.14 శాతం

    కర్నూలులో : 52.26 శాతం

    ప్రకాశంజిల్లాలో : 59.96 శాతం

    ఎన్టీఆర్‌ జిల్లాలో : 55.71 శాతం

    విజయనగరంలో : 54.31 శాతం

    తూర్పు గోదావరి జిల్లాలో : 52.32 శాతం

    పల్నాడులో : 56.48 శాతం

    శ్రీకాకుళంలో : 54.87 శాతం

    తిరుపతిలో : 54.42 శాతం

    గుంటూరులో : 52.24 శాతం

    కాకినాడలో : 52.69 శాతం

    సత్యసాయి జిల్లాలో : 57.56 శాతం

    పార్వతీపురం మన్యం జిల్లాలో : 51.75 శాతం

  • 13 May 2024 03:58 PM (IST)

    13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

    మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, మంథని, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలింగ్ క్లోజ్ అయింది. 4గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికే ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు. ఈ 13 సెగ్మెంట్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఈసీ. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

  • 13 May 2024 03:58 PM (IST)

    అన్నమయ్య జిల్లాలో మ. 3 గంటల వరకు 54.49 శాతం పోలింగ్

    అన్నమయ్య జిల్లాలో మ. 3.00 గంటల వరకు 54.49 శాతం పోలింగ్ నమోదు..

    రాజంపేట – 53.3 శాతం

    కోడూరు (ఎస్.సి) – 54.33 శాతం

    రాయచోటి – 53.45 శాతం

    తంబళ్లపల్లి – 55.54 శాతం

    పీలేరు – 57.25 శాతం

    మదనపల్లి – 53.1 శాతం

  • 13 May 2024 03:56 PM (IST)

    తిరుపతి జిల్లాలో గాలిలోకి కాల్పులు

    తిరుపతి జిల్లా రామచంద్రా పురం మండలం బ్రాహ్మణ కాలువ గ్రామంలో టిడిపి, వైసీపీ వర్గీయుల మధ్య గొడవ నెలకొంది. అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా CRPF పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ పోలింగ్ కేంద్రం వద్దకు వద్దకు చేరుకున్నారు.

  • 13 May 2024 03:54 PM (IST)

    అనంతపురం జిల్లాలో మ.3 గంటల వరకు పోలింగ్ శాతం

    అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 54.10 శాతం పోలింగ్ నమోదు

    సత్యసాయి జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 56.83 శాతం పోలింగ్ నమోదు

  • 13 May 2024 03:53 PM (IST)

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మ.3 గం.ల వరకు పోలింగ్ శాతం

    అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 57.54

  • 13 May 2024 03:52 PM (IST)

    చిత్తూరు జిల్లా పరిధిలో మ. 3 గంటల వరకు 61.94 శాతం పోలింగ్

    చిత్తూరు జిల్లా పరిధిలో మ. 3 గంటల వరకు 61.94 శాతం పోలింగ్

    చిత్తూరు అసెంబ్లీ 64.33 కుప్పం 60.45 పూతలపట్టు 60.19 పలమనేరు 61.40 గంగాధర నెల్లూరు 66.93 నగరి 61.93 పుంగనూరు 59.30

    చిత్తూరు పార్లమెంటు పరిధిలో 61.43 శాతం పోలింగ్ నమోదయింది

  • 13 May 2024 03:52 PM (IST)

    హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఓట్ల గల్లంతు..!

    హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఓట్ల గల్లంతైయ్యాయి. మూడు వేల ఓట్లు తొలగించారని ఓటర్ల ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్నకేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓటర్ల ఆందోళనకు మద్దతు తెలిపారు.  పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ విధించామన్నారు తెలంగాణ డీజీపీ. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సాయంత్రం వరకూ అలర్ట్‌గా ఉంటామని తెలిపారు డీజీపీ.

  • 13 May 2024 03:51 PM (IST)

    Nellore Districtలో మ. 3.గంల వరకు పోలింగ్ శాతం

    నెల్లూరు జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం.. మ.3 గం.ల వరకు..

    Nellore

    Nellore

  • 13 May 2024 03:48 PM (IST)

    Krishna Distలో మ.3.గంల వరకు నమోదైన పోలింగ్ శాతం

    కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం 59.39

    అత్యధికంగా అవనిగడ్డ నియోజకవర్గం లో 62.11% ఓటింగ్ నమోదు.

  • 13 May 2024 03:47 PM (IST)

    శ్రీకాకుళo జిల్లాలో మ. 3.గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

    శ్రీకాకుళo జిల్లాలోని 8 నియోజకవర్గాలలో మధ్యాహ్నం 3 గం.ల వరకు నమోదైన ఓటింగ్ శాతం 55.93

  • 13 May 2024 03:46 PM (IST)

    మధ్యాహ్నం 3గంటలకు తెలంగాణలో 52.30 శాతం పోలింగ్

    తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.94%పోలింగ్

    ఖమ్మం జిల్లాలో 63.67 శాతం పోలింగ్‌ నమోదు

    మెదక్‌ జిల్లాలో 60.94 శాతం పోలింగ్‌ నమోదు

    వరంగల్‌లో 54.17 శాతం పోలింగ్‌ నమోదు

    కేవలం 20% పోలింగ్‌తో బాగా వెనకబడిన హైదరాబాద్‌ పోలింగ్ సరళి

    సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ బైపోల్‌లో ఇప్పటి29.03 శాతం పోలింగ్ నమోదు

  • 13 May 2024 03:46 PM (IST)

    బాపట్ల జిల్లాలో భారీ వర్షం.. ఓటింగ్‌కు అంతరాయం

    బాపట్ల జిల్లాలోని పర్చూరు మండల పరిధిలో ని పలు గ్రామాలలో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం .

    ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

  • 13 May 2024 03:46 PM (IST)

    ఏపీలో 50 శాతం దాటిన పోలింగ్‌

    ఏపీలో 50%దాటి దూసుకుపోతున్న పోలింగ్‌ పర్సంటేజ్

    మధ్యహ్నాం 3గంటల సమయానికి ఏపీలో 55.49% పోలింగ్

    అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 61.43 శాతం పోలింగ్

    కడప జిల్లాలో 60.57% పోలింగ్ నమోదు

    అన్ని జిల్లాలతో పోల్చితే తక్కువగా విశాఖలో పోలింగ్ సరళి

    మధ్యాహ్నం  3గంటల సమయానికి విశాఖలో 46.01% పోలింగ్

  • 13 May 2024 03:44 PM (IST)

    ప్రకాశం జిల్లాలో నిలిచిపోయిన పోలింగ్

    ప్రకాశం జిల్లా:గిద్దలూరు మండలం నరవ గ్రామంలోని 210 పోలింగ్ బూత్‌లో గంటకు పైగా నిలిచిపోయిన పోలింగ్..

    ఈవీఎంలు మొరాయించడంతో ఆగిపోయిన ఓటింగ్..

    ఈవీఎంలకు మరమ్మత్తులు చేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు..

  • 13 May 2024 03:43 PM (IST)

    ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా: మధ్యాహ్నం 3 గం.ల వరకు పోలింగ్ శాతం

    ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మధ్యాహ్నాం గం. 3.00ల వరకు నమోదైన పోలింగ్ శాతం.

    మహబూబ్ నగర్ – 58.92%

    నాగర్ కర్నూల్ – 57.17%

  • 13 May 2024 03:42 PM (IST)

    సమస్యాత్మక ప్రాంతాల్లో మరో 20 నిమిషాల్లో ముగియనున్న పోలింగ్

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ , సిర్పూర్ , ఆసిపాబాద్ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకు ముగియనున్న పోలీంగ్

    మూడు గంటల వరకు 60 శాతం పోలీంగ్ నమోదు

    ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలోని సిర్పూర్ , ఆసిపాబాద్ లో 65 శాతం పోలింగ్ నమోదు

  • 13 May 2024 03:41 PM (IST)

    కాసేపట్లో 3 నియోజకవర్గాల్లో ముగియనున్న పోలింగ్‌

    అరకు, పాడేరు, రంపచోడవరంలో 4 గం.లకు పోలింగ్ పూర్తి

    మరో 3 నియోజకవర్గాల్లో 5 గం.లకు ముగియనున్న పోలింగ్

    పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ముగియనున్న పోలింగ్

    మిగిలిన 169 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు ఓటింగ్

  • 13 May 2024 03:41 PM (IST)

    తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో నమోదైన పోలింగ్ శాతం

    మ.3 గంటల వరకు జహీరాబాద్ లో అత్యధికంగా 63.96 శాతం పోలింగ్ నమోదయ్యింది.

    ఆదిలాబాద్, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, జహీరాబాద్ లో 60 శాతం దాటిన పోలింగ్

    అతి తక్కువగా హైదరాబాద్ లో 29.47 శాతం పోలింగ్

  • 13 May 2024 03:39 PM (IST)

    NTR District: మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ 55.71 శాతం

    ఎన్టిఆర్ జిల్లా మ. 3.00 గంటల వరకు పోలింగ్ 55.71 శాతం నమోదు

    Ntr Disct

    Ntr Disct

  • 13 May 2024 03:39 PM (IST)

    ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత

    ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ.

    పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల వ్యవహారంలో చెలరేగిన వివాదం.

    వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాట.

    పలువురికి గాయాలు, ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు.

  • 13 May 2024 03:38 PM (IST)

    మ.3.00 గం.ల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్

    మధ్యాహ్నం 3.00 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం

    ఆంధ్రప్రదేశ్ – 55.49%

    బిహార్ – 45.23%

    జమ్ము అండ్ కాశ్మీర్ – 29.93%

    ఝార్ఖండ్ – 56.42%

    మధ్యప్రదేశ్ – 59.63%

    మహారాష్ట్ర – 42.35%

    ఒడిశా – 52.91%

    తెలంగాణ – 52.34%

    ఉత్తర్ ప్రదేశ్ – 48.41%

    పశ్చిమ బెంగాల్ – 66.05%

  • 13 May 2024 03:32 PM (IST)

    ఏపీ, తెలంగాణల్లో 50%దాటి కొనసాగుతున్న పోలింగ్‌

    — 3గంటల సమయానికి ఏపీలో ఇప్పటికి 52.01% పోలింగ్

    — 3గంటల సమయానికి తెలంగాణలో 52.30% పోలింగ్

    — ఏపీలో ఉత్తరాంధ్రలో కాస్త మందకొడిగా పోలింగ్ సరళి

    — విశాఖ, అరకుల్లో తక్కువగా 40%లోపు మాత్రమే పోలింగ్

    — తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.94%పోలింగ్

    — మెదక్‌లో 60.94 శాతం పోలింగ్‌ నమోదు

    — వరంగల్‌లో 54.17 శాతం పోలింగ్‌ నమోదు

    — ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్‌ నమోదు

    — సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం  బైపోల్‌లో ఇప్పటి వరకు 29.03 శాతం పోలింగ్ నమోదు

  • 13 May 2024 03:29 PM (IST)

    నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

    నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని బైరాపూర్‌లో కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో అరగంట పాటు పోలింగ్ నిలిపివేశారు ఎన్నికల అధికారులు. బీజేపీ కార్యకర్తలు ఓట్లు వేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం దగ్గరే ఎక్కువ సేపటి నుంచి ఉంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుల నిరసన తెలిపారు. దీంతో రెండు పార్టీల మధ్య గొడవ తలెత్తింది.

  • 13 May 2024 03:25 PM (IST)

    పల్నాడు జిల్లాలో ఈవీఎల ధ్వంసం

    — పల్నాడు జిల్లా జెట్టిపాలెం పోలింగ్ బూత్‌పై దాడి

    — బూత్ నెం.215లో ఈవీఎల ధ్వంసం

    — రెండుముక్కలైన ఈవీఎంలు, ఫర్నీచర్ ధ్వంసం

    — టీడీపీ కార్యకర్తల విధ్వంసంతో నిలిచిపోయిన పోలింగ్

  • 13 May 2024 03:23 PM (IST)

    జిగిత్యాలః గోవిందరం బూత్ నెంబర్ 43లో ఉద్రిక్తత

    జగిత్యాల జిల్లా: మేడిపల్లి (భీమారం) మండలంలోని గోవిందరం బూత్ నెంబర్ 43లో ఉద్రిక్తత

    బూత్ ఇంచార్జిగా నియమించిన కారోబర్ ఇతర పార్టీలకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ

    వెంటనే తనను విధుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ శ్రేణుల నిరసన

    అతనిపై యాక్షన్ తీసుకుంటామని రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేసిన అధికారులు

  • 13 May 2024 03:21 PM (IST)

    ఉప్పల్‌ పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి

    హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్‌ పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి

    పోలింగ్‌ కేంద్రంలో కుప్పకూలిన భరత్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మి

    ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయారని తెలిపిన వైద్యులు

  • 13 May 2024 03:14 PM (IST)

    ఏపీలో మధ్యాహ్నం 2గంటల వరకు 50 శాతం పోలింగ్‌

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2గంటల వరకు 50శాతం పోలింగ్‌ నమోదు.

  • 13 May 2024 03:14 PM (IST)

    తెనాలి ఎమ్మెల్యే శివకుమార్‌ను అదుపులోకి తీసుకోవాలి: ఈసీ

    గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం.

    శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం

    పోలింగ్ పూర్తయ్యే వరకూ శివకుమార్‍ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

  • 13 May 2024 03:05 PM (IST)

    2019తో పోల్చితే పోల్ శాతం బాగుంది: సీఈవో వికాస్‌ రాజ్‌

    తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40శాతం దాటిందన్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం 20 శాతం నమోదైందన్నారు. మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. 2019తో పోల్చితే ఈ సమయానికి పోల్ శాతం బాగానే ఉందన్నారు. పలు సెగ్మెంట్లలో ఇప్పటికే 50 శాతం దాటిందన్న సీఈవో పోలింగ్ పూర్తయ్యే సమయానికి పెరుగుతుందన్నారు. పలు చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి కేసు నమోదు చేశామన్నారు. అటు జహీరాబాద్ , నిజామాబాద్ లో కేసులు వచ్చాయి. వచ్చే ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామన్నారు సీఈవో వికాస్ రాజ్. సీఎం రేవంత్ రెడ్డి పై వచ్చిన కంప్లైంట్స్ పై విచారణ చేస్తామన్నారు.

  • 13 May 2024 03:01 PM (IST)

    జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటేసిన బ్రహ్మానందం

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా సెలబ్రెటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులంతా హైదరాబాద్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని సెలబ్రెటీలు పిలుపునిచ్చారు. సీనియర్ నటుడు బ్రహ్మానందం, గౌతం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 02:59 PM (IST)

    మరచింతలో 2 గంటలుగా పనిచేయని ఈవీఎం

    వనపర్తి జిల్లా అమరచింత జడ్పీ హైస్కూల్‌లో 2 గంటలుగా పనిచేయని ఈవీఎం

    పోలింగ్ బూత్‌ నంబర్‌ 228/77లో ఈవీఎంల మొరాయింపు

    ఓటింగ్ నిలిపివేసిన ఎన్నికల అధికారులు

    ఓటేసేందుకు క్యూ లైన్‌లో ఎదురుచూస్తున్న ఓటర్లు

  • 13 May 2024 02:57 PM (IST)

    కొత్త శ్రీరంగరాజపురంలో నిలిచిన పోలింగ్

    విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో నిలిచిపోయిన పోలింగ్

    పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఆఫీసర్ రాంబాబు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపణ.

    వృద్దుల ఓట్లును వైసీపీకి బదులు టీడీపీకి వేస్తున్నారని ఏజెంట్ ఆరోపణ

    ఆందోళనకు దిగిన ఓటర్లు. విచారణ నిమిత్తం పీవోని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • 13 May 2024 02:55 PM (IST)

    గుంటూరు పశ్చిమలో దొంగ ఓట్ల కలకలం

    గుంటూరు పశ్చిమలో దొంగ ఓట్లు కలకలం సృష్టించాయి.

    విద్యానగర్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని మంత్రి రజినికి సమాచారం ఇచ్చిన ఏజెంట్

    పోలింగ్ కేంద్రానికి వచ్చిన రజిని, అప్పిరెడ్డి

    అధికారులతో వాగ్వాదం

    పోలింగ్ కేంద్రం బయట లాఠీ ఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

  • 13 May 2024 02:51 PM (IST)

    వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి పై ఈసీకి ఫిర్యాదు

    కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి పై ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. ఓటర్ స్లిప్పులపై వైసీపీ అభ్యర్థి ఫోటో ముద్రణపై ఫిర్యాదు. విచారణ చేపట్టారు మున్సిపల్ అధికారులు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన చట్టం కింద సాయి ప్రసాద్ రెడ్డి పై 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • 13 May 2024 02:49 PM (IST)

    పల్నాడు జిల్లా పాల్వాయిగేటు దగ్గర ఉద్రిక్తత

    — పల్నాడు జిల్లా పాల్వాయిగేటు దగ్గర ఉద్రిక్తత

    — ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై టీడీపీ కార్యకర్తల దాడి

    — పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసం

    — పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఘటన.

  • 13 May 2024 02:46 PM (IST)

    కేటీఆర్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

    బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్నికల అధికారికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన తర్వాత మీడియాను అడ్రస్ చేస్తూ తెలంగాణ తెచ్చిన నేతకు ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ నేతలు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

  • 13 May 2024 02:43 PM (IST)

    బీజేపీ అభ్యర్థి మాధవీలతపై సీఈవో రోనాల్డ్ రాస్ సీరియస్

    హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలతపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. ముస్లిం మహిళల నకాబ్ తొలగించి పరిశీలించినందుకు ఎన్నికల అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు.

  • 13 May 2024 02:41 PM (IST)

    తెలంగాణలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.38 శాతం పోలింగ్‌

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు 40.38 శాతం పోలింగ్‌ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు అప్రకటించారు. జిల్లాల వారీగా చూస్తే..

    అదిలాబాద్ – 50.18 శాతం

    భువనగిరి – 46.49 శాతం

    చేవెళ్ల – 34.56 శాతం

    హైదరాబాద్ – 19.37 శాతం

    కరీంనగర్ – 45.11 శాతం

    ఖమ్మం- 50.63 శాతం

    మహబూబాబాద్-48.81 శాతం

    మహబూబ్ నగర్-45.84 శాతం

    మల్కాజిగిరి- 27.69 శాతం

    మెదక్- 46.72 శాతం

    నాగర్ కర్నూల్ -45.88 శాతం

    నల్గొండ- 48.48 శాతం

    నిజామాబాద్- 45.67 శాతం

    పెద్దపల్లి- 44.87 శాతం

    సికింద్రాబాద్- 24.91 శాతం

    వరంగల్- 41.23 శాతం

    జహీరాబాద్-50.71 శాతం

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ (అసెంబ్లీ ఉప ఎన్నక)-29.03 శాతం

  • 13 May 2024 02:33 PM (IST)

    గచ్చిబౌలిలో ఓటేసిన హీరో నాని

    Actor Nani

    Actor Nani

    సినీ నటుడు నాచురల్ స్టార్ నాని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి విచ్చేసిన ఆయన ఓటేసి సిరా గుర్తు చూపించారు.

  • 13 May 2024 02:30 PM (IST)

    ఏపీలో జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు ఇవే..!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు భారీ ఓటింగ్ నమోదవుతోంది. మొదటి ఆరు గంటల్లో 40.26 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యింది. ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్న 1.70 కోట్ల మంది ఓటర్లు

    అల్లూరి 32.80

    అనకాపల్లి 37

    అనంతపురం 39.82

    అన్నమయ్య 39.60

    బాపట్ల 44.45

    చిత్తూరు 44.50

    కోనసీమ 44.03

    తూ.గోదావరి 38.54

    ఏలూరు 38.76

    గుంటూరు 40.12

    కాకినాడ 38.25

    కృష్ణా 44.50

    కర్నూలు 38

    నంద్యాల 44.20

    ఎన్టీఆర్ జిల్లా 39.60

    పల్నాడు 40.53

    పార్వతిపురం మన్యం 34.87

    ప్రకాశం 42.78

    నెల్లూరు 42.38

    సత్యసాయి 38.10

    శ్రీకాకుళం 40.56

    తిరుపతి 39.14

    విశాఖ 33.72

    విజయనగరం 40.30

    ప.గోదావరి 39.50

    కడప 45.56

  • 13 May 2024 02:21 PM (IST)

    ఏపీలో భారీగా నమోదవుతున్న పోలింగ్

    Ap Poll 1pm

    Ap Poll 1pm

    ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తారు. భారీగా తరలించిన ఓటర్లతో క్యూ లైన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.26 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదైంది. తర్వాతి స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. ఇక అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 50 శాతం పోలింగ్ పూర్తి అయ్యింది.

  • 13 May 2024 02:01 PM (IST)

    హైదరాబాద్‌లో 20శాతం పోలింగ్‌..

    హైదరాబాద్‌లో 20శాతం పోలింగ్‌ నమోదైందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్‌ స్లిప్‌లను పరిశీలించడం కోడ్‌ ఉల్లంఘనే అంటూ సీఈవో పేర్కొన్నారు. రేవంత్‌ మీద వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామని.. మాధవిలతపై కేసు నమోదు చేశామని తెలిపారు.

    తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని.. 2019తో పోలిస్తే పోలింగ్‌శాతం బాగానే ఉందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ 50శాతం దాటిందని వికాస్ రాజ్ తెలిపారు.

  • 13 May 2024 01:50 PM (IST)

    నెల్లూరులో ఉద్రిక్తత

    కొన్ని చోట్ల ఘర్షణలు, దాడులతో ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా దగదర్తిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడికి యత్నించాయి ఇరువర్గాలు.

  • 13 May 2024 01:43 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38 శాతం పోలింగ్‌

    ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.38 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 13 May 2024 01:41 PM (IST)

    మాధవీలతపై కేసు నమోదు..

    పోలింగ్ స్టేషన్ లో ముస్లిం మహిళా నకాబ్ తొలగించి పరిశీలించిన హైదరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చే చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు.

  • 13 May 2024 01:21 PM (IST)

    ఒంటిగంట వరకు 40% వరకు ఓటింగ్..  

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40% వరకు ఓటింగ్ నమోదయింది.

  • 13 May 2024 01:19 PM (IST)

    సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫిర్యాదు

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీకి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు.

  • 13 May 2024 01:13 PM (IST)

    టీవీ9 ఓటర్‌ సెల్ఫీ ఛాలెంజ్‌కి భారీ రెస్పాన్స్.. టెలిగ్రామ్ నెంబర్ ఇదే..

    • టీవీ9 ఓటర్‌ సెల్ఫీ ఛాలెంజ్‌కి భారీ రెస్పాన్స్
    • గంటగంటకూ వేలల్లో సెల్ఫీల సునామీ
    • ఇప్పటి వరకూ 3 లక్షలకుపైగా సెల్ఫీలు
    • ఓటర్‌ సెల్ఫీలు ఓవర్‌ఫ్లో అవడంతో.. టీవీ9 నంబర్‌కి సేవలు నిలిపివేసిన వాట్సప్‌
    • ఇకపై మీ సెల్ఫీలు టెలిగ్రామ్‌ నంబర్‌కు పంపాలి
    • టీవీ9 టెలిగ్రామ్ నంబర్‌ : 99 482 54 52 8
  • 13 May 2024 01:09 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేష్..

    మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చంద్రబాబుతోపాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 01:03 PM (IST)

    ఏజెంట్ల మధ్య ఘర్షణ

    ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఏజెంట్ల మధ్య ఘర్షణతో భయబ్రాంతులకు గురైన ఓటర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో పోలీసు బలగాలు భారీగా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి.

  • 13 May 2024 12:56 PM (IST)

    బీజేపీ ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది.. సీఎం రేవత్ రెడ్డి

    బిజెపి అభ్యర్థి మాధవి లత ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీని గురించి మీడియా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. తాను వీడియో చూడలేదని.. కానీ బిజెపి కేవలం ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.

  • 13 May 2024 12:43 PM (IST)

    స్వయంగా ఐడీ కార్డులు తనిఖీ చేసిన మాధవీలత

    హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను సందర్శిస్తూ స్వయంగా ఐడీ కార్డులు తనిఖీలు చేస్తూ కనిపించారు.

  • 13 May 2024 12:21 PM (IST)

    ఏపీలో పోలింగ్ శాతం ఇలా..

    • కడపలో 27.17 శాతం
    • చిత్తూరులో 26.10శాతం
    • బాపట్లలో 26.80 శాతం
    • అల్లూరిలో 18.43 శాతం
    • అనకాపల్లిలో 19.97 శాతం
    • అనంతపురంలో 23.91 శాతం
    • అన్నమయ్యలో 22.28 శాతం
    • కృష్ణాలో 26.14 శాతం
    • కోనసీమలో 26.81 శాతం
    • నంద్యాలలో 26.60 శాతం
    • విశాఖలో 20.42 శాతం
    • ఏలూరులో 24.40 శాతం
    • ప.గో.లో23.35 శాతం
    • నెల్లూరులో 23.60 శాతం
    • కర్నూలులో 21.90 శాతం
    • ప్రకాశంజిల్లాలో 24.10 శాతం
    • ఎన్టీఆర్‌ జిల్లాలో 29 శాతం
    • విజయనగరంలో 23.19 శాతం
    • తూ.గో.లో 21.79 శాతం
    • పల్నాడులో 23.18 శాతం
    • శ్రీకాకుళంలో 21.54 శాతం
    • తిరుపతిలో 22.80 శాతం
    • గుంటూరులో 24.28 శాతం
    • కాకినాడలో 21.45 శాతం
    • సత్యసాయి జిల్లాలో 20.58 శాతం
    • మన్యంజిల్లాలో 18.61 శాతం
  • 13 May 2024 12:16 PM (IST)

    జమ్మలమడుగులో ఉద్రిక్తత

    కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, కూటమి కార్యకర్తలు ఎదురుపడటంతో మాటా, మాటా పెరిగి ఇరువర్గాలు దాడికి యత్నించాయి. రెండువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

  • 13 May 2024 11:54 AM (IST)

    Telangana Election Voting Percent: తెలంగాణలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇదే..

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు నమోదు అయినా పోలింగ్ శాతం..24.31

    • అదిలాబాద్ -31.51
    • భువనగిరి -27.97
    • చేవెళ్ల -20.35
    • హైద్రాబాద్ -10.70
    • కరీంనగర్-26.14
    • ఖమ్మం-31.56
    • మహబూబాబాద్-30.70
    • మహబూబ్నగర్-26.99
    • మల్కాజిగిరి-15.05
    • మెదక్-28.32
    • నాగర్ కర్నూల్ -27.74
    • నల్గొండ-31.21
    • నిజామాబాద్-28.26
    • పెద్దపల్లి-26.17
    • సికింద్రబాద్-15.77
    • వరంగల్-24.18
    • జహీరాబాద్-31.83

    సికింద్రబాద్ కంటోన్మెంట్..16.34

  • 13 May 2024 11:49 AM (IST)

    AP Election Voting Percent: పీలో 11 గంటల వరకు 23.4 శాతం పోలింగ్‌ నమోదు

    • ఏపీలో 11 గంటల వరకు 23.4 శాతం పోలింగ్‌ నమోదు అయింది..
  • 13 May 2024 11:44 AM (IST)

    క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్ మృతి..

    ఏలూరు జిల్లా కైకలూరు మండలం వింజరంలో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చి క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్ గోలి ప్రభాకర్‌రావు కుప్పకూలి మృతి చెందాడు..

  • 13 May 2024 11:24 AM (IST)

    Mahabubnagar Lok Sabha Election: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

    కొడంగల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్ – 237లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 11:23 AM (IST)

    Medak Lok Sabha Election: ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్

    మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  కేసీఆర్ స్వగ్రామం చింత మడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 13 May 2024 10:55 AM (IST)

    Andhra Pradesh: వైసిపి ఏజెంట్‌పై కత్తితో దాడి..

    చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మండి కృష్ణపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి ఏజెంట్ సురేష్‌పై కత్తితో దాడి చేశారు. సురేష్ పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి ఆసుపత్రికి చేరుకుని సురేష్ ని పరామర్శించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసినట్టు ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు.

  • 13 May 2024 10:48 AM (IST)

    Pithapuram Assembly Election: ఓటు హక్కు వినియోగించున్న వంగా గీత

    పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    వీడియో చూడండి..

  • 13 May 2024 10:45 AM (IST)

    Andhra Pradesh Election 2024: ఓటర్ల మధ్య తోపులాట.. కిందపడిన ఈవీఎం

    బొట్లపాలెం పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య తోపులాట జరిగింది. దీంతో కేంద్రంలోని ఈవీఎం కింద పడిపోయింది.. అయితే.. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందీలేదని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రరకటించారు. ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామని.. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఘటన స్థలానికి వెళ్లాలని సాయుధ బలగాలు, రిటర్నింగ్ ఆఫీసరుకు ఆదేశించారు.

  • 13 May 2024 10:41 AM (IST)

    Revanth Reddy: కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి..

    ఓటు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కొడంగల్ లోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.

  • 13 May 2024 10:34 AM (IST)

    AP Elections: ఆనందం కలిగిస్తోంది: సజ్జల రామకృష్ణారెడ్డి

    ఉదయాన్నే పెద్ద ఎత్తున ಓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరడం ఆనందం కలిగిస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోలింగ్‌ ఏర్పాట్లు బాగున్నాయన్న సజ్జల.. ప్రతీ ఒక్కరు ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

  • 13 May 2024 10:31 AM (IST)

    Telangana Election 2024: తెలంగాణలో పోలింగ్ శాతం ఇలా..

    తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదు..

    • ఆదిలాబాద్‌లో 13.22 శాతం
    • జహీరాబాద్‌లో 12.88 శాతం
    • నల్గొండలో 12.80 శాతం
    • ఖమ్మంలో 12.24 శాతం
    • మహబూబాబాద్‌లో 11.94 శాతం
    • మెదక్‌లో 10.99 శాతం
    • నిజామాబాద్‌లో 10.91 శాతం
    • భువనగిరిలో 10.54 శాతం
    • మహబూబ్‌నగర్‌లో 10.33 శాతం
    • కరీంనగర్‌లో 10.23 శాతం
    • నాగర్‌కర్నూల్‌లో 9.81 శాతం
    • పెద్దపల్లిలో 9.53శాతం
    • వరంగల్‌లో 8.97 శాతం
    • చేవెళ్లలో 8.29 శాతం
    • మల్కాజ్‌గిరిలో 6.20 శాతం
    • హైదరాబాద్‌లో 5.6 శాతం
    • సికింద్రాబాద్‌లో 5.40 శాతం

    ఉప ఎన్నికలో..

    సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 6.28 శాతం

  • 13 May 2024 10:30 AM (IST)

    ఏపీలో 9 గంటల వరకు పోలింగ్‌ శాతం ఇలా

    ఏపీలో 9 గంటల వరకు 9.21 శాతం పోలింగ్‌ నమోదు..

    • కడపలో 12.09 శాతం
    • చిత్తూరులో 11.84శాతం
    • బాపట్లలో 11.36 శాతం
    • అల్లూరిలో 6.77 శాతం
    • అనకాపల్లిలో 8.37 శాతం
    • అనంతపురంలో 9.18 శాతం
    • అన్నమయ్యలో 9.89 శాతం
    • కృష్ణాలో 10.80 శాతం
    • కోనసీమలో 10.42 శాతం
    • నంద్యాలలో 10.32 శాతం
    • విశాఖలో 10.24 శాతం
    • ఏలూరులో 9.9 శాతం
    • ప.గో.లో 9.57 శాతం
    • నెల్లూరులో 9.51 శాతం
    • కర్నూలులో 9.34 శాతం
    • ప్రకాశంజిల్లాలో 9.14 శాతం
    • ఎన్టీఆర్‌ జిల్లాలో 8.95 శాతం
    • విజయనగరంలో 8.77 శాతం
    • తూ.గో.లో 8.68 శాతం
    • పల్నాడులో 8.53 శాతం
    • శ్రీకాకుళంలో 8.30 శాతం
    • తిరుపతిలో 8.11 శాతం
    • గుంటూరులో 6.17 శాతం
    • కాకినాడలో 7.95 శాతం
    • సత్యసాయి జిల్లాలో 6.92 శాతం
    • మన్యంజిల్లాలో 6.30 శాతం
  • 13 May 2024 10:29 AM (IST)

    Telangana Election 2024: ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఓటు వేయాలి.. హరీష్‌రావు

    సిద్దిపేటలో మాజీమంత్రి హరీష్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే పట్టణాల్లో పోలింగ్‌ శాతం పెరుగుతోందని.. మేధావులు, విద్యావంతులు పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజలు ఓటు వేయాలని హరీష్ రావు కోరారు.

  • 13 May 2024 10:15 AM (IST)

    Hyderabad Elections 2024: హైదరాబాద్‌లో 5.06 శాతం పోలింగ్‌ నమోదు

    ఉదయం నుంచి అర్బన్ పార్లమెంట్‌ స్థానాల్లో మందకొడిగా పోలింగ్ సాగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఓటు వేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపడంలేదు.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06 శాతం పోలింగ్‌ నమోదు అయింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో కూడా మందకొడిగా పోలింగ్‌ కొనసాగుతోంది..

  • 13 May 2024 09:57 AM (IST)

    Hyderabad Lok Sabha Election: హైదరాబాద్‌లో మందకొడిగా సాగుతున్న పోలింగ్..

    హైదరాబాద్ పాతబస్తీలో మందకొడిగా సాగుతున్న పోలింగ్.. ఓటర్లు లేక వెలవెలబోతున్న కేంద్రాలు..

  • 13 May 2024 09:49 AM (IST)

    9గంటల వరకు పోలింగ్ శాతం ఇదే..

    10 రాష్ట్రాల్లో నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది..

    10 రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం- 10.35%

    ఆంధ్రప్రదేశ్ – 9.05%

    బీహార్ -10.18%

    జమ్మూ అండ్ కాశ్మీర్ – 5.07%

    జార్ఖండ్ -11.78%

    మధ్యప్రదేశ్ -14.97%

    మహారాష్ట్ర – 6.45%

    ఒడిస్సా – 9.23%

    తెలంగాణ – 9.51%

    ఉత్తర ప్రదేశ్ – 11.67%

    వెస్ట్ బెంగాల్ – 15.24%

  • 13 May 2024 09:43 AM (IST)

    దలువాయిపల్లిలో ఉద్రిక్తత.. ఆగిన పోలింగ్..

    అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం దలువాయిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది.. కొందరు వ్యక్తులు ఈవీఎంలను పగలగొట్టారు. దీంతో పోలింగ్ ఆగిపోయింది..

  • 13 May 2024 09:40 AM (IST)

    ప్రత్యేక పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన కశ్మీరీ పండిట్లు

    సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కశ్మీరీ పండిట్ల కోసం జమ్ములోని బర్నాయ్‌లో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కాశ్మీరీ పండిట్లు భారీ సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 09:39 AM (IST)

    ప్రజాస్వామ్య రక్షణకు పవిత్రమైన ఆయుధం ఓటు: బాలకృష్ణ

    హిందూపురంలో బాలకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య రక్షణకు పవిత్రమైన ఆయుధం ఓటు అని.. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని బాలకృష్ణ కోరారు.

  • 13 May 2024 09:37 AM (IST)

    Nalgonda Lok Sabha Election: ఓటు హక్కు వినియోగించుకున్న నల్గొండ జిల్లా కలెక్టర్

    నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు

  • 13 May 2024 09:35 AM (IST)

    సమస్యలు ఉంటే 1950కి ఫిర్యాదు చేయండి..

    ఎలక్షన్‌ మానిటరింగ్ టీమ్‌తో CEO వికాస్‌రాజ్‌భేటీ అయ్యారు. ఈవీఎంల మొరాయింపు, ఫిర్యాదులపై సమీక్ష చేస్తున్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించినట్లు వికాస్ రాజ్ తెలిపారు. సమస్యలు ఉంటే 1950కి ఫిర్యాదు చేయాలని వికాస్‌రాజ్ సూచించారు.

  • 13 May 2024 09:31 AM (IST)

    తెలంగాణలో ఉదయం 9.30గంటల వరకు 9.5 శాతం పోలింగ్

    తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9.30 గంటల వరకు 9.51 పోలింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

  • 13 May 2024 09:27 AM (IST)

    ఓటు వేసేందుకు వచ్చి.. వృద్ధురాలు మృతి..

    విజయనగరంలో ఓటు వేసేందుకు వచ్చి క్యూలైన్‌లో నిల్చున్న వృద్ధురాలు మృతి చెందింది. నెల్లిమర్ల నియోజకవర్గం తంగుడుబిల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు.. చాలా సేపు నిల్చొని కుప్పకూలింది.. మృతురాలు పలూరి పెంటమ్మగా గుర్తించారు. ఓటర్లకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండ వేడిమి తట్టుకోలేక మృతి చెందినట్లు స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.

  • 13 May 2024 09:23 AM (IST)

    మైనింగ్ రద్దు చేయాలంటూ ఎన్నికల బహిష్కరణ..

    నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలం మైలారం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఓటర్లు లేక 179 వ పోలింగ్ కేంద్రం వెలవెలబోతోంది.. గ్రామంలో ఉన్న గుట్ట మైనింగ్ ను రద్దు చేయాలంటూ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న ఆర్డీవో మాధవి.. ఓటర్లతో చర్చిస్తున్నారు. మైనింగ్ NOC ని రద్దు చేసే వరకు ఎన్నికలలో పాల్గొనమని గ్రామస్థుల స్పష్టం చేశారు.

  • 13 May 2024 09:21 AM (IST)

    కరెంటు లేదని నిరసన

    పిఠాపురం 153వ బూత్ లో కరెంటు లేదని ఓటర్లు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఈవీఎంలలో చీకట్లో ఉన్నాయంటూ సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేశారు. ఈవీఎంలలో గుర్తులు కనిపించడం లేదని అధికారులను ప్రశ్నించారు.

  • 13 May 2024 09:20 AM (IST)

    పోలింగ్ బహిష్కరించిన గ్రామస్థులు

    ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్ మండలం రాయమాదారం గ్రామ ప్రజలు పోలింగ్ ను బహిష్కరించారు.  ఎన్ఎస్పీ కాలువ పై బ్రిడ్జి నిర్మించలేదని.. నిర్మించాలంటూ నిరసన తెలుపుతున్నారు.

  • 13 May 2024 09:16 AM (IST)

    70శాతం అంచనా వేస్తున్నాం.. వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు..

    రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని అంటున్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర అవాంచనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను మోహరించామని తెలిపారు.

  • 13 May 2024 09:05 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్..

    మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకొచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

  • 13 May 2024 08:53 AM (IST)

    ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ: కిషన్ రెడ్డి

    ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరుతున్నాను.. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ భారత లోక్ సభ ఎన్నికలు.. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నికోవడానికి ఓటు కీలకం.. అవినీతి.. కుటంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి ఓటు కీలకం… అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

  • 13 May 2024 08:48 AM (IST)

    ఎన్నికల నిర్వహణలో పోలీసుల వైఫల్యం: విజయసాయిరెడ్డి

    ఎన్నికల నిర్వహణలో పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కనీస సిబ్బంది లేరని.. సమస్యను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు..

  • 13 May 2024 08:44 AM (IST)

    ధాన్యం కొనుగోలు చేస్తేనే ఓటు వేస్తాం..

    యాదాద్రి జిల్లాలోని కనుముక్కలలో ఉద్రిక్తత చోటుచేకుంది.. తడిసిన ధాన్యంతో రైతులు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రం దగ్గర ధాన్యం బస్తాలతో ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే ఓటు వేస్తామని నిరసన తెలిపారు..

  • 13 May 2024 08:42 AM (IST)

    అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి..

    హైదారాబాద్‌ జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ ప్రముఖులు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు డైరెక్టర్లు తేజ, పరుచూరి, సినీనటుడు సుమంత్‌..

  • 13 May 2024 08:29 AM (IST)

    ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత: మెగాస్టార్ చిరంజీవి

    యువత ఓటును సద్వినియోగం చేసుకోవాలి.. సరైన ప్రభుత్వాలు వస్తేనే ఆశించిన అభివృద్ధి సాధ్యం.. ఓటు వినియోగించుకోవడం మన బాధ్యత.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. జూబ్లీక్లబ్‌లో చిరంజీవి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 08:27 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి..

    జూబ్లీ క్లబ్ పోలింగ్ స్టేషన్లో మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవితోపాటు సురేఖ, సుస్మిత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 08:26 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్‌

    తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్‌ జరగనుంది.

  • 13 May 2024 08:23 AM (IST)

    కిషన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

    కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. కిషన్ రెడ్డి ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మోదీ పేరును ప్రస్తావించినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయలని కాంగ్రెస్ ఈసీని కోరింది..

  • 13 May 2024 08:18 AM (IST)

    మొరాయించిన ఈవీఎం.. మొదలవ్వని పోలింగ్

    నిజామాబాద్‌లోని నవిపేట మండలం రాంపూర్ గ్రామంలో పోలింగ్ మొదలు కాలేదు.. 182 బూత్‌లో ఈవీఎం మొరాయింపుతో పోలింగ్ నిలిచిపోయింది.. దీంతో గ్రామస్థులు క్యూలో నిల్చున్నారు.

  • 13 May 2024 08:16 AM (IST)

    నాలుగో విడతలో పోటీ పడుతున్న పలువురు దిగ్గజ నేతలు..

    నాలుగో విడతలో ఏపీ(25), తెలంగాణ (17), బిహార్(5), ఝార్ఖండ్(4), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), ఒడిశా(4), యూపీ(13), ప.బెంగాల్(8), జమ్ముకశ్మీర్(1) లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది..

    ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్‌తో పాటు షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఎటా, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్ నియోజవర్గాల్లో జరుగుతున్న పోలింగ్

    4వ విడతలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో అఖిలేష్ తో పాటు టీఎంసీ నేతలు మహువా మొయిత్రా (కృష్ణనగర్ – బెంగాల్), శత్రుఘ్న సిన్హా (ఆసన్సోల్ – బెంగాల్), బీజేపీ ముఖ్య నేతలు గిరిరాజ్ సింగ్ (బేగుసరాయి – బీహార్), అర్జున్ ముండా (ఖుంటి – ఝార్ఖండ్) ఉన్నారు.

  • 13 May 2024 08:04 AM (IST)

    మాజీ మంత్రి, ఎంపీ ఓటు వేస్తుండగా.. మొరాయించిన ఈవీఎం..

    నెల్లూరు రూరల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది.. మాజీ మంత్రి అనిల్‌ ఓటు వేస్తుండగా ఈవీఎం మొరాయించడంతో ఆయన అక్కడే వేచిఉన్నారు. పోలింగ్‌ కేంద్రంలోనే విజయసాయిరెడ్డి తోపాటు అనిల్‌ ఉన్నారు.

  • 13 May 2024 08:03 AM (IST)

    గతంలో చెప్పాను.. అల్లు అర్జున్..

    తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ అన్నారు. కావాల్సిన వాళ్లకు పార్టీతో సంబంధం లేకుండా మద్దతిస్తానని.. ఎన్నికల్లో నిలబడితే మద్ధతిస్తానని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి గతంలో చెప్పానంటూ వ్యాఖ్యానించారు. ఆ క్రమంలోనే నంద్యాల వెళ్లి రవికి మద్దతు తెలిపానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

  • 13 May 2024 07:52 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు..

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రబాబుతోపాటు భువనేశ్వరి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 07:50 AM (IST)

    ఏపీలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది.. ఏపీ ఎన్నికల అధికారి

    ఏపీలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుందని.. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని.. ఈ ఘటనలపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దుస్తుల కలర్ విషయంలో ఎలాంటి కోడ్‌ ఉల్లంఘన లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి మీనా తెలిపారు.

  • 13 May 2024 07:46 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్

    సీఎం జగన్‌మోహన్ రెడ్డి భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 07:44 AM (IST)

    ప్రజలందరూ కదిలిరావాలి.. సీఎం జగన్

    పోలింగ్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలందరూ కదిలిరావాలని.. సీఎం జగన్ ట్వీట్ చేశారు. తప్పకుండా ఓటు వేయాలని సీఎం జగన్‌ కోరారు.

  • 13 May 2024 07:39 AM (IST)

    రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలి.. ప్రధాని మోదీ పిలుపు..

    నాలుగో దశ పోలింగ్‌పై ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు యువత, మహిళలు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం.. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయి.. ఏపీ ప్రజలు రికార్డుస్థాయిలో ఓట్లు వేయాలి.. అంటూ మోదీ పిలుపునిచ్చారు..

  • 13 May 2024 07:37 AM (IST)

    ఓటేసిన మాధవీలత

    హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత సికింద్రాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ బూత్ కు చేరుకుని ఓటు వేశారు.

  • 13 May 2024 07:32 AM (IST)

    ఓటేసిన అల్లు అర్జున్..

    జూబ్లీహిల్స్‌‌లో అల్లు అర్జున్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 07:24 AM (IST)

    జూబ్లీహిల్స్‌ లో జూ.ఎన్టీఆర్..

    ఓటు హక్కు వినియోగించుకునేందుకు జూ.ఎన్టీఆర్ తన ఫ్యామీలితో కలిసి ఉదయాన్నే జూబ్లీహిల్స్‌ కేంద్రానికి చేరుకున్నారు.

  • 13 May 2024 07:20 AM (IST)

    ఈవీఎంల మొరాయింపు..

    భద్రాచలం 136 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభంకాలేదు..

    కొవ్వూరు 92 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించింది..

    గుత్తి MS జూ.కాలేజీలో ఈవీఎం మోరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు..

  • 13 May 2024 07:19 AM (IST)

    సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు

    • తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు భారీ బందోబస్తు
    • పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత
    • సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు
    • అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌
    • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు
    • ఏజెన్సీ ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్లతో నిఘా
    • పారామిలిటరీ బలగాలు, స్థానిక పోలీసులతో బందోబస్తు
  • 13 May 2024 07:17 AM (IST)

    ఆంధ్రప్రదేశ్‌లో హైఓల్టేజ్‌

    • నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభం
    • ఓటింగ్‌ ప్రారంభానికి ముందే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు
    • తెల్లవారుజాము నుంచే పలుచోట్ల ఘర్షణలు
    • పల్నాడు జిల్లా రెంటచింతల, కమలాపురం మండలం కోగట్టంలో ఘర్షణలు
    • పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత
  • 13 May 2024 07:16 AM (IST)

    కరెంట్ కష్టాలు

    అనంతపురం: రాయదుర్గంలో కరెంట్ కష్టాలతో ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో కరెంట్ సరఫరాలో అంతరాయం కలిసగింది. దీంతో మాక్‌పోలింగ్‌ నిలిచిపోయింది.. పోలింగ్ ప్రారంభమయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది..

  • 13 May 2024 07:13 AM (IST)

    వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

    కడపలో ఉద్రిక్తత..

    • కమలాపురం మండలం కోగట్టంలో ఉద్రిక్తత
    • వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
    • ఎన్నికల వాతావరణం చెడగొట్టొద్దని స్థానికుల ఆందోళన

    పల్నాడు: రెంటచింతల మండలం రెంటాలలో ఉద్రిక్తత

    • టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
    • ఇద్దరు పోలింగ్‌ ఏజెంట్లకు గాయాలు
    • గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు
  • 13 May 2024 07:10 AM (IST)

    ఓటేసిన పలువురు ప్రముఖులు..

    • జూబ్లీహిల్స్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
    • బర్కత్‌పురాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • 13 May 2024 07:08 AM (IST)

    దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌

    • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌
    • 96 లోక్‌సభ స్థానాలకు సాయంత్రం 6 వరకు పోలింగ్‌
    • ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్
    • ఏపీలో 25, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
  • 13 May 2024 07:06 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ షురూ..

    నేతల తలరాతను రాసే ఓట్ల పండుగకు ఏపీ, తెలంగాణ సిద్ధమైంది. అన్ని ప్రాంతాల్లో 7గంటలకు పోలింగ్‌ మొదలయ్యాయింది.. ఓటేసేందుకు తెలంగాణ, ఏపీ జనం ఇప్పటికే బారులుతీరారు.. మాక్‌ పోలింగ్‌ పూర్తి కాగానే.. ఏడు గంటలకలు ఓటింగ్‌ ప్రారంభమైంది..

  • 13 May 2024 06:57 AM (IST)

    పులివెందులలో భద్రత కట్టుదిట్టం

    ఓవైపు పోలింగ్… మరోవైపు సీఎం జగన్ టూర్‌తో పులివెందులలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి కేంద్ర బలగాలను మోహరించారు. ఓటు వేశాక కొన్ని గంటలు పులివెందులలోనే గడపనున్న సీఎం జగన్‌… ఆ తర్వాత తిరిగి తాడేపల్లి వెళ్తారు.

  • 13 May 2024 06:42 AM (IST)

    తెలంగాణలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..

    రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 32 లక్షల 32 వేల మంది ఓటర్లున్నారు. యువ ఓటర్లు 9 లక్షల 20 వేల మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 9 వేల 900 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ బందోబస్తు కోసం 164 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. 73 వేల 414 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.

  • 13 May 2024 06:39 AM (IST)

    తెలంగాణ వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్

    • తెలంగాణ వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్
    • తెలంగాణలో 17ఎంపీ, ఒక MLA స్థానానికి పోలింగ్
    • 13 సమస్యాత్మక సెగ్మెంట్ల పరిధిలో సా.4 వరకు పోలింగ్
    • 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సా.6 వరకు పోలింగ్
    • తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు బరిలో 525 మంది
    • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక
    • తెలంగాణలో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు
    • అత్యధికంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి 45మంది
    • అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 12 మంది పోటీ
  • 13 May 2024 06:36 AM (IST)

    ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్‌

    • ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు కాసేపట్లో పోలింగ్‌
    • అరకు, పాడేరు, రంపచోడవరంలో సా.4:30 వరకు పోలింగ్‌
    • పాలకొండ, కురుపాం, సాలూరులో సా.5 వరకు పోలింగ్‌
    • ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
    • ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,387 మంది
    • ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు బరిలో 454మంది అభ్యర్థులు
    • ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు
  • 13 May 2024 06:31 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మాక్‌ పోలింగ్‌

    • తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మాక్‌ పోలింగ్‌
    • పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో నిర్వహణ
    • కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యం
    • పోలింగ్‌ సమయానికి 90 నిమిషాల ముందు మాక్‌ పోలింగ్
    • ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌

Published On - May 13,2024 6:30 AM

Follow us
పెళ్లికూతుర్ని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత
పెళ్లికూతుర్ని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత
ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయా? 'మెటా ఏఐ' చెప్పిన సమాధానం ఏంటంటే..
ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయా? 'మెటా ఏఐ' చెప్పిన సమాధానం ఏంటంటే..
త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..