Elections 2024: ప్రారంభమైన నాలుగో దశ.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఇవాళే పోలింగ్‌

లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం 10 రాష్ట్రాలు, యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు (సోమవారం) పోలింగ్‌ జరుగుతుంది. వీటితోపాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా నేడు ఎన్నికలు జరగుతున్నాయి. అటు ఒడిశాలోనూ తొలి దశలో 28 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌..

Elections 2024: ప్రారంభమైన నాలుగో దశ.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఇవాళే పోలింగ్‌
Lok Sabha Elections Phase 4
Follow us
Srilakshmi C

|

Updated on: May 13, 2024 | 7:43 AM

న్యూఢిల్లీ, మే 12: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం 10 రాష్ట్రాలు, యూటీల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు (సోమవారం) పోలింగ్‌ జరుగుతుంది. వీటితోపాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా నేడు ఎన్నికలు జరగుతున్నాయి. అటు ఒడిశాలోనూ తొలి దశలో 28 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఏయే పార్లమెంట్‌ స్థానాలకు..  ఎక్కడెక్కడంటే..

తెలంగాణలో 17, ఏపీలో 25 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమబెంగాల్‌లో 8, జమ్ముకశ్మీర్‌లో 1 స్థానం.. ఈ 97 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. వీటిల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దాదాపు 1.92 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మరికాసేపట్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దాదాపు 17.70 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు.

బరిలో ప్రముఖులు

నేడు జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, టీఎంసీ నేత మహు వా మొయిత్రా, కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌, నిత్యానంద్‌ రాయ్‌, పంకజ ముండే వంటి పలువురు కీలక నేతల అదృష్టం నేడు జరిగే ఎన్నికల్లో పరీక్షించుకోనున్నారు. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543 సీట్లు ఉండే లోక్‌సభ స్థానాలకు గానూ ఇప్పటి వరకు జరిగిన మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు దశల్లో 283 స్థానాల్లో పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన 96 స్థానాలకు ఈ రోజు పోలింగ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.