AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మెదక్‌లో ఘోరం..! బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టాడనీ.. కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌​మోజులో పడి జీవితాన్ని గుల్ల చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. సోషల్​మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ పగలూ రాత్రీ తేడా లేకుండా ఫోన్లకు బానిసలై పోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి నిత్యం లక్షల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో గుట్టుగా కొందరి వ్యక్తుల మధ్య జరిగే బెట్టింగ్‌ వ్యవహారం..

Telangana: మెదక్‌లో ఘోరం..! బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టాడనీ.. కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!
Father Killed Son Due To Online Betting Addiction
Srilakshmi C
|

Updated on: May 12, 2024 | 12:15 PM

Share

మెదక్‌, మే 12: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌​మోజులో పడి జీవితాన్ని గుల్ల చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. సోషల్​మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ పగలూ రాత్రీ తేడా లేకుండా ఫోన్లకు బానిసలై పోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి నిత్యం లక్షల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో గుట్టుగా కొందరి వ్యక్తుల మధ్య జరిగే బెట్టింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వీటి మాయలో పడిన అమాయకుల జేబులను కేటుగాళ్లు కొల్లగొడుతున్నారు. నష్టపోయిన వారు గత్యంతరం లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. తాజాగా బెట్టింగ్‌ అలవాటు పడి కోట్ల రూపాయలు పొగొట్టిన కుమారుడిని ఆ తండ్రి క్షమించలేక పోయాడు. పట్టరాని ఆవేశంతో కన్న కొడుకని కూడా చూడకుండా రాడ్డుతోకొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మెదక్‌ జిల్లాలో శనివారం రాత్రి (మే 11) చోటు చేసుకుంది.

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్‌ కుమార్‌ (28) ముకేశ్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గమనించిన తండ్రి సత్యనారాయణ అలవాటు మానుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోని ముకేశ్‌ ఇప్పటి వరకూ రూ.2 కోట్ల వరకు డబ్బులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పొగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోని కొడుకుపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కుమారుడు ముకేశ్‌పై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. కుమారుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో తీవ్రగాయాల పాలైన ముకేశ్‌ కుమార్ మృతి చెందాడు.

మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కౌశిక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారమే తండ్రీ కుమారుల మధ్య గొడవకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.