AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అర్ధరాత్రి చుక్కేసి రచ్చచేసిన యువతులు.. పోలీస్‌ కాలర్‌ పట్టుకుని బూతులు తిడుతూ ముష్టియుద్ధం!

మద్యం మత్తులో ముగ్గురు యువతులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారిలో ఒక యువతి పోలీసులకు క్షమాపణలు చెబుతుంటే.. మరో యువతి మాత్రం తగ్గేదే లే.. అంటూ ఓ అధికారి కాలర్‌ పట్టుకుని నానాయాగీ చేసింది. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని విరార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం..

Viral Video: అర్ధరాత్రి చుక్కేసి రచ్చచేసిన యువతులు.. పోలీస్‌ కాలర్‌ పట్టుకుని బూతులు తిడుతూ ముష్టియుద్ధం!
Drunk Woman Grabs Police Officer Collar
Srilakshmi C
|

Updated on: May 10, 2024 | 3:52 PM

Share

ముంబై, మే 10: మద్యం మత్తులో ముగ్గురు యువతులు వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వారిలో ఒక యువతి పోలీసులకు క్షమాపణలు చెబుతుంటే.. మరో యువతి మాత్రం తగ్గేదే లే.. అంటూ ఓ అధికారి కాలర్‌ పట్టుకుని నానాయాగీ చేసింది. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని విరార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో ముగ్గురు యువతులు అర్ధరాత్రి పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం కనిపిస్తుంది. పోలీసులను దుర్బాషలాడుతూ, అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురు అమ్మాయిలు పోలీసులతో కాలు దువ్వి గొడవ పెట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. తొలుత కాస్త చూసీచూడనట్టు పోలీసులు వ్యవహరించినా.. ముగ్గురు యవతుల్లో ఓ అమ్మాయి కయ్యానికి కాలుదువ్వింది. ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ కాలర్‌ పట్టుకుని గొడవకు దిగింది. మరో యువతి మహిళా కానిస్టేబుల్‌ చేతిని కొరికి యూనీఫాం చించేసింది. దీంతో అక్కడ గందరగోళం తలెత్తింది.

ఇవి కూడా చదవండి

మిగిలిన ఇద్దరు యువతులు ఆమెను విడిపించేందుకు యత్నించినా.. ఉడుం పట్టు మాదిరి పోలీస్‌ కాలర్‌ విడిచిపెట్టలేదు. ఓ వైపు పోలీస్‌ బలగం.. మరో వైపు ఇద్దరు యువతులు ఎంత ప్రయత్నించినా ఆమె పట్టు నుంచి ఇన్‌స్పెక్టర్‌ను వదిలించలేకపోయారు. ఇంతలో చుట్టు ఉన్న పోలీసులు తలో దెబ్బవేసి చితక బాదడంతో కాలర్‌ విడిచిపెట్టింది. పోలీసులు అతి కష్టం మీద ఆ ముగ్గురిని నియంత్రించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 353, 323, 325, 504, 506 కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరిచి, పోలీస్‌ కస్టడీకి తరలించారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.