Watch Video: ‘అన్నా.. వద్దే భయమేస్తుందే..!’ డేంజరస్‌ స్టంట్‌ చేస్తూ ఆఖరి నిమిషంలో గగ్గోలు.. వైరల్ వీడియో

సాహసాలు చేసేందుకు ఆసక్తి చూపే వారు ఎలాంటి భయం, సంకోచం లేకుండా ప్రమాదకరమైన విన్యాసాలు అలవోకగా చేసేస్తుంటారు. చూసే వారికి మాత్రం 'వీళ్లసలు మనుషులేనా..? ఇలాంటి స్టండ్స్‌ ఎలా చేస్తార్రా బాబూ..!' అంటూ మనసులోనే తెగ తిట్టేసుకుంటారు. చూసినందుకే దాదాపు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినంత పనిచేస్తారు. రకరకాల స్టంట్‌లకు సంబంధించిన వివిధ వీడియోలు దాదాపు ప్రతి రోజూ సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తుంటాయి..

Watch Video: 'అన్నా.. వద్దే భయమేస్తుందే..!' డేంజరస్‌ స్టంట్‌ చేస్తూ ఆఖరి నిమిషంలో గగ్గోలు.. వైరల్ వీడియో
Skyscraper Stunt
Follow us

|

Updated on: May 09, 2024 | 7:36 PM

సాహసాలు చేసేందుకు ఆసక్తి చూపే వారు ఎలాంటి భయం, సంకోచం లేకుండా ప్రమాదకరమైన విన్యాసాలు అలవోకగా చేసేస్తుంటారు. చూసే వారికి మాత్రం ‘వీళ్లసలు మనుషులేనా..? ఇలాంటి స్టండ్స్‌ ఎలా చేస్తార్రా బాబూ..!’ అంటూ మనసులోనే తెగ తిట్టేసుకుంటారు. చూసినందుకే దాదాపు హార్ట్‌ ఎటాక్‌ వచ్చినంత పనిచేస్తారు. రకరకాల స్టంట్‌లకు సంబంధించిన వివిధ వీడియోలు దాదాపు ప్రతి రోజూ సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తుంటాయి. అలాంటి వీడియోలు చూసి ఇన్‌స్పైర్‌ అయ్యాడో.. ఏమో.. తెలియదు గానీ ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే..

ఓ వ్యక్తి తాడు సహాయంతో ఎత్తైన స్కైస్క్రాపర్‌ దూకేందుకు సిద్ధమయ్యాడు. మరో వ్యక్తి (ఇన్‌స్ట్రక్టర్‌) అతడిని దాదాపు ఆకాశంలో వేలాడదీశాడు. ఇన్‌స్ట్రక్టర్‌ అంచున నిలబెట్టి తాడు కొస పట్టుకుని విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆకరి నిమిషంలో ఏమనుకున్నాడో ఏమో తెలియదు గానీ మనోడు భయంతో హడలెత్తిపోయాడు. తనను పైకి లాగాలని, ఈ స్టంట్‌ చేయనని వేడుకున్నాడు. అయినా పట్టించుకోని ఇన్‌స్ట్రక్టర్‌ అతడిని నెమ్మదిగా నెమ్మదిగా క్రిందికి తోసేయడం వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో స్టంట్ చేస్తున్న వ్యక్తి అతన్ని వేడుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చే వ్యక్తి తన చేతిలోని తాడును విడిచిపెడతాడు. ఆ తర్వాత అతను ఒక్కసారిగా కిందకు పడిపోతాడు. నేలకు.. ఆకాశానికి మధ్యలో వేలాడటం వీడియోలో చూడొచ్చు. ఈ దృశ్యం చూసేవారికి ఎవరికైనా గూస్‌బంప్‌ తెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోInternetH0F అనే యూజర్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం 21 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వీక్షణలు, లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో సామాజిక మాధ్యమాల్లో వైలర్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న విధాలుగా స్పందిస్తు్న్నారు. ఇంత ప్రమాదకరమైన ఫీట్ చేశాడు.. ‘ఈ వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే’ అంటూ నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో అభినందిస్తున్నారు. ‘ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌ ఎవరైనా ఇష్టపూర్వకంగా ఎలా చేయగలరో నాకు అర్థం కాలేదు’, ‘వీటి వల్ల ఏంటిరా లాభం..?’, ‘లక్ష రూపాయలు ఇచ్చినా ఈ స్టంట్ ఎప్పటికీ చేయను’ అంటూ పలువురు కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
10మంది టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ప్లేఆఫ్స్ ఆడేది ఐదుగురే
10మంది టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ప్లేఆఫ్స్ ఆడేది ఐదుగురే
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల కాల్పులు.. ఎందుకంటే..
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
జియో రైల్‌ యాప్‌తో టికెట్స్‌ పక్కా.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే...
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
తారక్ కోసం తరలివచ్చిన 10 లక్షల మంది
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
చరిత్ర సృష్టించిన SRH.. ఒక్కరోజులోనే ఆర్‌సీబీ రికార్డ్‌ బ్రేక్
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
'బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నమ్మలేము'.. కాంగ్రెస్ సీనియర్ నేత..
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్‌.. అమెజాన్‌ సేల్‌లో ఏకంగా 80
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
నీట మునిగిన పంటతో రైతు కంట కన్నీరు.. సాయం కోసం ఎదురు చూపులు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..