Viral Video: ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపైకి ఎక్కిన ట్రక్కు! ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
ట్రక్కు డ్రైవర్ చేసిన ఘోర తప్పిదానికి ఓ నిండు కుటుంబం బలైపోయింది. రాజస్థాన్‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై యు-టర్న్ తీసుకుంటున్న ట్రక్కు అటుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం..
సవాయి మాధోపూర్, మే 8: ట్రక్కు డ్రైవర్ చేసిన ఘోర తప్పిదానికి ఓ నిండు కుటుంబం బలైపోయింది. రాజస్థాన్‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై యు-టర్న్ తీసుకుంటున్న ట్రక్కు అటుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్స్‌ప్రెస్‌వేలోని సిసిటివి ఫుటేజీలోని వీడియో ప్రకారం..
సికార్ జిల్లా నుంచి రణతంబోర్‌లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి ఓ కుటుంబం కారులో బయల్దేరింది. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు సవాయ్ మాధోపూర్ జిల్లాలోని బనాస్ నది వంతెన సమీపంలో ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ వేపైకి వచ్చింది. అయితే అదే సమయంలో ఓ ట్రక్కు రోడ్డుపై యూటర్న్ తీసుకుంటుంది. ముందు వెళ్తున్న ఆ ట్రక్కు ఒక్కసారిగా రాంగ్ యూ టర్న్ తీసుకోవడంతో దాని వెనుక వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. అనంతరం కారుపైకి ట్రక్స్ ముందు భాగం ఎక్కింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ పరార్ అయ్యాడు.
Sawai Madhopur Accident Live Video: सवाई माधोपुर हादसे का लाइव वीडियो आया सामने, देखें कैसे एक गलती से खत्म हो गया पूरा परिवार https://t.co/OE1kSYp8vC #Sawaimadhopur #Sikar #Accident pic.twitter.com/FKFNSwNsvc
— FM SIKAR 89.6 (@FMSIKAR) May 8, 2024
మృతులను మనీష్ శర్మ, అతని భార్య అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, అతని అత్త సంతోష్, అతని స్నేహితుడు కైలాష్‌గా గుర్తించారు. మనన్, దీపాలి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అదే రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ దియా కుమారి సంతాపం తెలిపారు. ‘సవాయ్ మాధోపూర్ జిల్లాలోని బౌన్లీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది మరణించారనే వార్త చాలా బాధాకరమైనది. బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు’ భజన్‌లాల్ శర్మ ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.