AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insects inside Nose: బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు

ఓ మహిళకు ముక్కు మూసుకుపోయి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. పైగా ముక్కు నుంచి రక్తం కూడా కారడం ప్రారంభించింది. దీంతో భయందోళనకు గురైన మహిళ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు మొదట దుమ్ము ధూళి కారణంగా సంభవించిన ఎలర్జీగా భావించారు. వైద్య పరీక్షల్లో భాగంగా స్కాన్‌ చేయగా ముక్కు లోపల పురుగులాంటి బతికున్న జీవులు వందలకొద్ది ఉండటం చూసి వైద్యులు పరేషాన్‌ అయ్యారు..

Insects inside Nose: బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
Hundreds Of Maggots Living In Nose
Srilakshmi C
|

Updated on: May 08, 2024 | 6:22 PM

Share

ఓ మహిళకు ముక్కు మూసుకుపోయి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. పైగా ముక్కు నుంచి రక్తం కూడా కారడం ప్రారంభించింది. దీంతో భయందోళనకు గురైన మహిళ ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు మొదట దుమ్ము ధూళి కారణంగా సంభవించిన ఎలర్జీగా భావించారు. వైద్య పరీక్షల్లో భాగంగా స్కాన్‌ చేయగా ముక్కు లోపల పురుగులాంటి బతికున్న జీవులు వందలకొద్ది ఉండటం చూసి వైద్యులు పరేషాన్‌ అయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది.

థాయ్‌లాండ్‌లోని నాకోర్న్‌పింగ్ ఆసుపత్రికి వచ్చిన 59 యేళ్ల వృద్ధురాలు ముక్కు మూసుకుపోయి గాలిసలపడం లేదంటూ వైద్య సహాయం కోరింది. ముక్కు నుంచి రక్తం కారడంతోపాటు ముఖం అంతా నొప్పిగా ఉందంటూ సదరు మహిళ డాక్టర్లు తెలిపింది. అనంతరం, డాక్టర్ పాటిమోన్ థానాచైఖాన్ ఆమె ముక్కును ఎక్స్-రే తీసి, పరిశీలించారు. ఆమె ముక్కు రంధ్రాలలో పురుగుల్లాంటివి కనిపించాయి. వెంటనే ఎండోస్కోప్ చేయగా ఏకంగా 100కి పైగా పురుగులు బయటకు వచ్చాయి. ఎండోస్కోపీలో రెండు నాసికా కుహరాలలో ఈ పురుగులను తొలగించారు. ఇలాంటి సందర్భాల్లో చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ కీటకాలు కళ్ళు, మెదడు వంటి సమీప శరీర అవయవాలకు వ్యాపించి వైకల్యం, ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. విచిత్రంగా పురుగులు తొలగించిన తర్వాత సదరు మహిళ ఆరోగ్యం మెరుగుపడింది.

కాగా శ్వాసకోశ వ్యాధులు, అలెర్జీలు, రినైటిస్ వంటివి థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయి వంటి ఉత్తర ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే 2022లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి చెవినొప్పి, దురద, రక్తస్రావం, నొప్పి సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లగా.. అతని చెవిలో మాంసం తినే పురుగు ఉన్నట్లు గుర్తించి, తొలగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.