Black Cobra: నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
పాములంటే సాధారణంగా అందరికీ భయమే. కొందరు పాము పేరు చెప్పగానే ఆమడదూరం పరుగెడతారు. అయినా హిందూ సంప్రదాయంలో పాములను దేవతగా ఆరాధిస్తారు. పాలుపోసి పూజలు చేస్తారు. అయితే అది ఆరుబయట పుట్టల దగ్గరో, లేక ఆలయాల్లోనో పూజలు చేస్తారు. కానీ ఓ కుటుంబం ఏకంగా ప్రమాదకరమైన నాగుపామును తీసుకొచ్చి ఇంట్లోనే పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో కొందరు పూజలు చేస్తున్నారు. అందరూ ఎంతో భక్తిగా కూర్చుని పూజలో పాల్గొన్నారు. వారంతా చేసేది ఏ సత్యనారాయణవ్రతమో కాదు.. ఏకంగా ఓ పెద్ద నాగుపామును తీసుకొచ్చి పళ్లెంలో కూర్చోబెట్టి పాలాభిషేకం చేస్తూ పూజలు చేస్తున్నారు. అదికూడా ప్రమాదకరమైన బ్లాక్ కోబ్రా.. దానిని చూస్తుంటేనే గుండెజారిపోతుంది. అలాంటిది ఆ పాము చుట్టూ అందరూ కూర్చుని అర్చకుడు మంత్రాలు చదువుండగా నాగుపాముకు పూజలు చేశారు. ఆ నాగుపాము పళ్లెంలో చుట్టూ తిరుగుతూ ఎవరిని కాటువేద్దామా అన్నట్టుగా చూస్తోంది. ఓసారి ఎవరినో కాటేయబోయింది కూడా. కానీ తప్పించుకున్నారు. అయినా ఎవ్వరూ భయపడలేదు, అక్కడినుంచి కదలనూలేదు. పూజలు కంటిన్యూ చేసారు. ఇది ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, వీడియో చూస్తే శివరాత్రి సందర్భంగా ఆ కుటుంబం పామును పూజించినట్లు తెలుస్తోంది. ఓంకార్ సనాతని పేరుతో ఓ నెటిజన్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. హిందూ సంస్కృతిలో శివుడు, నాగ దేవతకు ఉన్న ప్రాధాన్యత గురించి అందులో వివరించాడు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను ఏకంగా 3.68 లక్షలమంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. కొందరు ఆ ఫ్యామిలీ ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ప్రాణం మీదకు తెచ్చే ఇలాంటి పూజలు సరికాదని విమర్శించారు. ఓ యూజర్ అయితే శివరాత్రి కాబట్టి పామును పూజించారు.. దుర్గా నవరాత్రులు అయితే పులినో లేక సింహానో కూర్చోబెట్టి పూజిస్తారా? అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

