మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

Anil kumar poka

|

Updated on: May 10, 2024 | 10:18 PM

మీరు ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీ నీడను గమనించారా? ఎవరు మీ వెంట ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను అన్నట్టుగా మనతోనే వస్తుంది. అందుకే తోడు-నీడ అంటారు. మనుషులు ఎవరూ ఎప్పుడూ ఎవరికీ వెన్నంటి ఉండరు.. ఎవరైనా మనతో కొంతవరకే తోడుగా వస్తారు.. ఎంతటి ఆప్త మిత్రులైనా ఎప్పుడో అప్పడు ఎక్కడో అక్కడి ఆగిపోతారు... కానీ నీడ మాత్రం మన వెంటే ఉంటుంది.

మీరు ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీ నీడను గమనించారా? ఎవరు మీ వెంట ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను అన్నట్టుగా మనతోనే వస్తుంది. అందుకే తోడు-నీడ అంటారు. మనుషులు ఎవరూ ఎప్పుడూ ఎవరికీ వెన్నంటి ఉండరు.. ఎవరైనా మనతో కొంతవరకే తోడుగా వస్తారు.. ఎంతటి ఆప్త మిత్రులైనా ఎప్పుడో అప్పడు ఎక్కడో అక్కడి ఆగిపోతారు.. కానీ నీడ మాత్రం మన వెంటే ఉంటుంది. అలాంటి నీడకూడా మనతోరాని రోజు ఒకటి ఉంటుందని తెలుసా? అవును మన నీడకూడా మనకి కనిపించదు. ఏడాదిలో రెండుసార్లు మనకి మన నీడ కనిపించదు. అది ఎప్పుడంటే..? అవును, గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మన నీడ ‘మాయం’ అవుతుంది! ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. ఈ ‘శూన్య నీడ’ రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే.. నిటారుగా ఉండే మనిషి, జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు. హైదరాబాద్‌లో ఈ శూన్యనీడ రోజు.. గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకూ కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదన్నారు. ఔత్సాహికులు తమ ఫొటోలను birlasc@gmail.com కు పంపించాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.