Free Villa: 42 ఎకరాల్లో అతి పెద్ద విల్లా.. ఫ్రీగా ఇస్తామంటున్న ప్రభుత్వం. కానీ..
ప్రభుత్వం పిలిచి మరీ ఓ పెద్ద విల్లాను ఫ్రీగా ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.. ఎగిరి గంతేసి మరీ దానిని దక్కించుకోడానికి క్యూలు కడతారు కదా. కానీ జర్మనీలో 47 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ అతిపెద్ద విల్లాను ఉచితంగా ఇస్తాం..కావాలనుకున్నవారు తీసుకోవచ్చంటూ జర్మన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆఫర్ ఇచ్చింది. అవును మరి పెద్ద పెద్ద భవనాలను కట్టేయగానే సరిపోతుందా.. వాటిని మెయింటెయిన్ చెయ్యాలిగా.. అదే ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
ప్రభుత్వం పిలిచి మరీ ఓ పెద్ద విల్లాను ఫ్రీగా ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.. ఎగిరి గంతేసి మరీ దానిని దక్కించుకోడానికి క్యూలు కడతారు కదా. కానీ జర్మనీలో 47 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ అతిపెద్ద విల్లాను ఉచితంగా ఇస్తాం..కావాలనుకున్నవారు తీసుకోవచ్చంటూ జర్మన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆఫర్ ఇచ్చింది. అవును మరి పెద్ద పెద్ద భవనాలను కట్టేయగానే సరిపోతుందా.. వాటిని మెయింటెయిన్ చెయ్యాలిగా.. అదే ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాంతో ఆ విల్లాను ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేద్దామని డిసైడ్ అయింది. జర్మన్ నియంత హిట్లర్ పేరు వింటేనే ఒకప్పుడు ప్రపంచం వణికిపోయింది. ఆయన అత్యంత సన్నిహితుల్లో జోసెఫ్ గోబెల్స్ ఒకరు. ఆయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడు. వార్తా పత్రికలు, రేడియో, సినిమా మాధ్యమాలను ఉపయోగించుకొని నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించారు.
జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న ఆ విల్లా ఈయనదే. 1936లో దానిని నిర్మించారు. గోబెల్స్ దీనిని అనేక అవసరాలకు వినియోగించారని, అక్కడ పలువురు నటీమణులతో సంబంధాలు నడిపారని పలు కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భవంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, నాజీ పాలనతో ముడిపడిన చరిత్ర వంటి కారణాలతో దానిని వదిలించుకోవాలని చూస్తోంది. ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే.. ప్రభుత్వం దానిని బహుమతిగా అందజేస్తుంది అని ఆ దేశ ఆర్థిక మంత్రి స్టెఫాన్ ఎవర్స్ వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ నివసించడం లేదు. ప్రస్తుతం అది రోజురోజుకూ శిధిలావస్థకు చేరుతోంది. దానిని సొంతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తగిన ప్రతిపాదన లేకపోతే.. ప్రభుత్వం దానిని కూల్చివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

