Hyderabad: బుల్లెట్‌పై వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. కట్ చేస్తే…
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రన్నింగ్‌లో ఉన్న బుల్లెట్ బైక్‌కు మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. ఒక్కసారిగా బైక్ పేలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ పాతబస్తీ భవాని నగర్ పరిధిలో ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి బుల్లెట్ బైక్‌పై వెళుతుండగా అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ నడుపుతున్న వ్యక్తికి మంటలు అంటుకున్నాయి. దీంతో అతడు వెంటనే బైక్ దిగి పక్కకు వెళ్లిపోయాడు. బైక్‌కు అంటుకున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్‌పై నీళ్లు పోశారు. ఆ సమయంలో బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. అందులో ఓ కానిస్టేబుల్ ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన మొఘల్‌పురాలోని బీబీ బజార్ రోడ్డులో చోటుచేసుకుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను ఓ వ్యక్తి నడుపుతుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై నుంచి దూకి తనను తాను రక్షించుకోగా, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పైపుతో నీరు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా మోటారు సైకిల్ ఒక్కసారిగా పేలడంతో మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న వ్యక్తులు, పక్కనే ఉన్న మరికొందరికి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం మొఘల్‌పురాలోని ప్రిన్సెస్ ఎస్రా ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

