AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెలు తరుక్కుపోయే ఘటన.. ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరిన తల్లి

కర్నాటకలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి నవ మాసాలు మోసిన కని పెంచిన బిడ్డ పట్ల కర్కశ్యంగా ప్రవర్తించింది. ఆరేళ్ల బిడ్డను మోసళ్ళకు ఆహారంగా వేసింది. ఉత్తర కన్నడలో 32 ఏళ్ల మహిళ తన ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హత్య ఆరోపణలపై అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

గుండెలు తరుక్కుపోయే ఘటన.. ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరిన తల్లి
Boy Murder
Balaraju Goud
|

Updated on: May 10, 2024 | 3:42 PM

Share

కర్నాటకలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి నవ మాసాలు మోసిన కని పెంచిన బిడ్డ పట్ల కర్కశ్యంగా ప్రవర్తించింది. ఆరేళ్ల బిడ్డను మోసళ్ళకు ఆహారంగా వేసింది. ఉత్తర కన్నడలో 32 ఏళ్ల మహిళ తన ఆరేళ్ల కుమారుడిని మొసళ్లు నివసించే కాలువలోకి విసిరింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హత్య ఆరోపణలపై అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన హలమడి గ్రామంలో చోటుచేసుకుంది. సావిత్రి అనే మహిళ, ఆమె భర్త రవికుమార్ (36) దంపతులకు ఒక కుమారుడు. అయితే తమ కుమారుడు వినోద్‌కు వినికిడి, మాట్లాడే లోపం ఉండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత, సావిత్రి రాత్రి 9 గంటల సమయంలో వినోద్‌ను తీసుకుని వెళ్లి మొసళ్ళు ఉండే కాలువలోకి విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాలువ మొసళ్లతో కూడిన కాళీ నదికి కలుపుతుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, అగ్నిమాపక దళం డైవర్ల సహాయంతో గాలింపు ప్రయత్నాలకు చీకటి కారణంగా ఆటంకం ఏర్పడింది. రాత్రి కావడంతో వినోద్ మృతదేహం ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది రిస్య్కూ టీమ్. మృతదేహంపై తీవ్రగాయాలు, గాట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి కుడి చేతిని పాక్షికంగా తిన్న మొసలి దవడల నుండి బాలుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన పోలీసలు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఇళ్ళల్లో పనిమనిషిగా పనిచేస్తున్న సావిత్రి, తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న రవికుమార్‌లను కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. తన భర్త మానసికంగా హింసించాడని, తమ కుమారుడి మరణానికి తన భర్త రవికుమార్ కారణమని సావిత్రి ఆరోపించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…