Chicken Shawarma: చికెన్ షావర్మ తిని ఆసుపత్రి పాలైన స్నేహితులు.. ఒకరు మృతి, మరో ఐదురుగురికి సీరియస్

చికెన్ షావర్మా తిని చనిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. గతంలో తమిళనాడులో 14 ఏళ్ల బాలిక మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు రోడ్‌ పక్కన దుఖాణంలో చికెన్ షావర్మా తిన్నాడు. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. అతనితో పాటు షవర్మా తిన్న మరో ఐదుగురు..

Chicken Shawarma: చికెన్ షావర్మ తిని ఆసుపత్రి పాలైన స్నేహితులు.. ఒకరు మృతి, మరో ఐదురుగురికి సీరియస్
Chicken Shawarma
Follow us
Srilakshmi C

|

Updated on: May 09, 2024 | 7:56 PM

ముంబై, మే 9: చికెన్ షావర్మా తిని చనిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. గతంలో తమిళనాడులో 14 ఏళ్ల బాలిక మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు రోడ్‌ పక్కన దుఖాణంలో చికెన్ షావర్మా తిన్నాడు. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. అతనితో పాటు షవర్మా తిన్న మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ట్రాంబే పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రలోని మాన్‌ఖుర్డ్‌లోని పట్టణానికి చెందిన ప్రథమేష్ భోక్సే (19) మే 3 సాయంత్రం ఆనంద్ కాంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే తన స్నేహితులతో కలిసి చికెన్ షావర్మా తినడానికి వెళ్ళాడు. రోడ్డు పక్కన ఓ దుఖాణంలో స్నేహితులతో కలిసి షావర్మ తిన్నాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కాసేపటికే కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే రోజు సాయంత్రం వరకు వాంతులు ఆగకపోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. భోక్సే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పరేల్‌లోని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు భోక్సేకి కొన్ని మందులు ఇచ్చి ఇంటికి పంపించారు.

ఇంటికి చేరుకున్న కాసేపటికి పరిస్థితి విషమించడంతో మళ్లీ KEM ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు మృతి చెందాడు. చెడిపోయిన చికెన్‌ తినడం వల్లనే ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీంతో చికెన్ షావర్మా దుకాణం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రాజ్‌పుత్ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304, 34 కింద అభియోగాల కింద ఆనంద్ కాంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షేక్‌లను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే దుఖాణంలో షావర్మ తిని ఫుడ్ పాయిజనింగ్‌ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతవం వారంతా ప్రాణాపాయం నుంచి బయటడి కోలుకుంటున్నారని డీసీపీ రాజ్‌పుత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.