Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ! ఏకంగా కారులోనే దుకాణం పెట్టేశాడుగా.. వీడియో వైరల్
మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చిన్న చిన్న వీధి దుఖాణాలు దర్శనమిస్తుంటాయి. ఏదైనా ప్రాంతంలో వీధికి వెళితే అక్కడ రోడ్డు పక్కన తిను బండారాలు, జ్యూస్‌లు, ఐస్ క్రీంలు విక్రయించే చిరు వ్యాపారులు తప్పక కనిపిస్తారు. ఇలాంటి వీధి వ్యాపారులకు డిమాండ్ కూడా ఫుల్‌గానే ఉంటుంది. ఎగబడి మరీ జనాలు కొనేస్తుంటారు. సాధారణంగా ఇలాంటి చిరు వ్యాపారులు తోపుడు బండ్లు లేదంటే సైకిల్ బండ్లతో కనిపిస్తుంటారు..
మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చిన్న చిన్న వీధి దుఖాణాలు దర్శనమిస్తుంటాయి. ఏదైనా ప్రాంతంలో వీధికి వెళితే అక్కడ రోడ్డు పక్కన తిను బండారాలు, జ్యూస్‌లు, ఐస్ క్రీంలు విక్రయించే చిరు వ్యాపారులు తప్పక కనిపిస్తారు. ఇలాంటి వీధి వ్యాపారులకు డిమాండ్ కూడా ఫుల్‌గానే ఉంటుంది. ఎగబడి మరీ జనాలు కొనేస్తుంటారు. సాధారణంగా ఇలాంటి చిరు వ్యాపారులు తోపుడు బండ్లు లేదంటే సైకిల్ బండ్లతో కనిపిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కారులోనే దుఖాణం తెరిచాడు. ఎండలకు చల్లని పానియాలు అందిస్తూ స్థానికంగా యమ పాపులర్ అయ్యాడు. ఇతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వేసవి కాలంలో జనాలు చల్లటి పానియాలు ఎక్కువగా తాగేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అలాంటి వాటిల్లో చెరకు రసం కూడా ఒకటి. ఏదైనా పనిమీద బయటికి వెళ్లినప్పుడు కొబ్బరి నీళ్లు లేదంటే చెరుకు రసం తప్పనిసరిగా తాగుతారు. ఈ కారణంగా గానే చాలా మంది వేసవిలో చెరుకు రసాన్ని అమ్మడం ప్రారంభిస్తారు. ఈ వీడియోలో కనిపించే వ్యక్తి కూడా చెరకు రసాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు ఏకంగా తన కారునే ఉపయోగించుకున్నాడు. కారులో చెరకు రసం తీసే యంత్రాన్ని అమర్చి ఉండటం వీడియోలో చూడొచ్చు. కారు టాప్ పార్ట్‌లో కొన్ని చెరకు గడలు కట్టి ఉండటం వీడియోలో కనిపిస్తాయి.
भारत में कुछ भी संभव हैं कार में ही लगा दिया गन्ने का मशीन 😜😅 pic.twitter.com/hzc7a9hyvy
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 9, 2024
తన వాహనంలో ఈ వ్యక్తి చెరుకు రసం తీసే యంత్రాన్ని అమర్చి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చప్రాజిలా అనే యూజర్ ఎక్స్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. ‘భారతదేశంలో ఏదైనా సాధ్యమే.. కారులోనే చెరకు యంత్రాన్ని అమర్చాడు’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘అహా ఏం ఐడియా గురు..’ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఇలాంటి ఎన్నో క్రియేటివ్ వీడియోలు చూసి ఉంటారు. బతకడానికి వేయి మార్గాలు అనీ.. పెద్దలు ఊరికే అనలేదు. కష్టకాలంలో మెదడు పాదరసంలా పనిచేస్తుంది. అప్పుడే ఇలాంటి ఐడియాలు పుట్టుకొస్తాయి. మీరేమంటారు..?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.