AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే..! వీడియో వైరల్

దేవుళ్లు తమలోని అనురాగ, ఆప్యాయతలు మనుషుల్లో చూసుకోవడానికి రక్తసంబంధాలు సృష్టించాడట. గర్భాన మోసి బిడ్డకు జన్మనివ్వక పోయినా.. తన గారాల పట్టి ఏ తండ్రికైనా అపురూపమే. ఆ తండ్రికి తన కుమార్తె రాజకుమారే. తనకు ఉన్నంతలో కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ.. కంటికి పాపలా రక్షిస్తాడు. తండ్రి పైకి ఎంత గంభీరంగా కనిపించినా.. తన కూతురు దగ్గర మాత్రం పసివాడే. ప్రతి దశ దాటుతూ ఎదుగుతున్న కూతురుని చూసుకుని ఆనందంతో పరవశించిపోతాడు. తాజాగా అలాంటి ఓ ఆపురూప..

Viral Video: కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే..! వీడియో వైరల్
Auto Rickshaw Driver Celebrates Daughter’s Birthday
Srilakshmi C
|

Updated on: May 10, 2024 | 5:00 PM

Share

బెంగళూరు, మే 10: దేవుళ్లు తమలోని అనురాగ, ఆప్యాయతలు మనుషుల్లో చూసుకోవడానికి రక్తసంబంధాలు సృష్టించాడట. గర్భాన మోసి బిడ్డకు జన్మనివ్వక పోయినా.. తన గారాల పట్టి ఏ తండ్రికైనా అపురూపమే. ఆ తండ్రికి తన కుమార్తె రాజకుమారే. తనకు ఉన్నంతలో కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ.. కంటికి పాపలా రక్షిస్తాడు. తండ్రి పైకి ఎంత గంభీరంగా కనిపించినా.. తన కూతురు దగ్గర మాత్రం పసివాడే. ప్రతి దశ దాటుతూ ఎదుగుతున్న కూతురుని చూసుకుని ఆనందంతో పరవశించిపోతాడు. తాజాగా అలాంటి ఓ ఆపురూప సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన గారాలపట్టి పుట్టిన రోజును విభిన్నంగా సెలబ్రేట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఆటోవాలా తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా తన ఆటోను పింక్‌ బెలూన్‌ తో అలంకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘సుమేధఉప్పల్’ అనే యూజర్‌ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోకు లక్షల్లో వీక్షణలు, వేలల్లో కామెంట్లు, లైకులు రావడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు కూతురిపై ఆ తండ్రికున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. తన కూతురిపై తనకున్న ప్రేమను సాధారణ బెలూన్‌తో జరుపుకుంటున్న విధానం చూసి ముచ్చటపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

‘ఇది చాలా అందంటా ఉంది. చిన్న వేడుకను తనదైన రీతిలో సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. అతను నిజంగా గొప్ప తండ్రి’, నేటి బిజీ లైఫ్‌లో కూతురు బర్త్‌డే ఇంత క్యూట్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది’, ‘ధనిక పేదా అనే తేడా లేకుండా భావోధ్వేగాలు అందరికీ ఒకేలా ఉంటాయి’ అంటూ పలువురు తమదైన రీతిలో కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.