AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంట్లో ఆడుకుంటూ ఉండగా హఠాత్తుగా స్పృహ తప్పిన ఏడాది చిన్నారి.. స్కాన్ చేయగా రిపోర్టు చూసి వైద్యులు షాక్!

ఆ తల్లిదండ్రులు పిజ్జా ఆర్డర్‌ చేశారు. ఇంటికి వచ్చిన పిజ్జాను ఏడాది చిన్నారి ఆబగా తనసాగింది. ఇంతలో అందులో ఉన్న క్యారెట్‌ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఊపిరాడక హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. అంతవరకూ కళ్లముందు ఆడుతూ.. పాడుతూ.. గెంతులేసిన చిన్నారి హఠాత్తుగా స్పృహ తప్పడంతో కంగారు పడిపోయారు ఆ తల్లిదండ్రులు. వెంటనే హుటాహుటీన ఆసుపత్రికి..

Telangana: ఇంట్లో ఆడుకుంటూ ఉండగా హఠాత్తుగా స్పృహ తప్పిన ఏడాది చిన్నారి.. స్కాన్ చేయగా రిపోర్టు చూసి వైద్యులు షాక్!
Carrot Stuck In Baby Throught
Srilakshmi C
|

Updated on: May 12, 2024 | 2:49 PM

Share

కొత్తకోట, మే 12: ఆ తల్లిదండ్రులు పిజ్జా ఆర్డర్‌ చేశారు. ఇంటికి వచ్చిన పిజ్జాను ఏడాది చిన్నారి ఆబగా తనసాగింది. ఇంతలో అందులో ఉన్న క్యారెట్‌ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఊపిరాడక హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. అంతవరకూ కళ్లముందు ఆడుతూ.. పాడుతూ.. గెంతులేసిన చిన్నారి హఠాత్తుగా స్పృహ తప్పడంతో కంగారు పడిపోయారు ఆ తల్లిదండ్రులు. వెంటనే హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా.. స్కాన్ చేసిన వైద్యులు రిపోర్టు చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో చోటు చేసుకుంది. ఇంతకీ రిపోర్టులో ఏముందంటే..

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన జహిర్​ దంపతుల రెండో కుమార్తె పిజ్జా తింటూ ఉండగా.. పిజ్జాలోని క్యారెట్‌ ముక్క మింగే క్రమంలో గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో కుటుంబీకులు హుటాహుటీన పట్టణంలోని రాహుల్‌ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు తరలించారు. అప్పటికే చిన్నారి స్పృహ కోల్పోయింది. అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్‌ చేయడం మొదలు పెట్టారు.

నోట్లోకి పైప్‌ పంపించి వెంటిలేటర్‌ సాయంతో కృత్రిమ శ్వాసను అందించారు. అనంతరం స్కాన్‌ చేసి చూడగా రెండు ఊపిరితిత్తుల మధ్య క్యారెట్‌ ముక్క ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంనటే డాక్టర్ మనీషారెడ్డి పర్యవేక్షణలో ఇంటర్నేషనల్‌ పల్మనాలజిస్ట్‌ వెంకట్‌రెడ్డి బృందం ఆధ్వర్యంలో బ్రాంకోస్కోపీ చేసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఊపిరితిత్తుల మధ్యలో ఇరుక్కున్న క్యారెట్‌ ముక్కను బ్రాంకోస్కోపీ సాయంతో విజయవంతంగా తొలగించారు. దాదాపు 48 గంటల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. కాగా వనపర్తి జిల్లాలో బ్రాంకోస్కోపీ సర్జరీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?