మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌..! మరోసారి నగరంలో మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ

మ‌ద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, క‌ల్లు ద‌కాణాలు మూసి ఉంటాయ‌ని సీపీ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చ‌రించారు.

మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌..! మరోసారి నగరంలో మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ
Wine Shops Will Close
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 04, 2023 | 5:38 PM

మద్యం ప్రియులకు రాచకొండ పోలీసులు మరోసారి షాకిచ్చారు. మొన్నటి మొన్న శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేసిన అధికారులు.. మరోమారు షెట్టర్లు మూసేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 6వ తేదీన హ‌నుమాన్ జయంతి సంద‌ర్భంగా రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్ 6వ తేదీన ఉద‌యం 6 గంట‌ల నుంచి 7వ తేదీన ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, క‌ల్లు ద‌కాణాలు మూసి ఉంటాయ‌ని సీపీ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చ‌రించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..