Minister Kishan Reddy: నాలుగేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్దికి కేసీఆర్ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ అవసరం చాలా ఉందన్నారు. సెకండ్ ఫేజ్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. ఆ పార్టీని బ్రహ్మాదేవుడు కూడా కాపాడలేడని అన్నారు. ఎంఎంటీఎస్ హైదరాబాద్‌కు ఎంతో అవసరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సెకండ్ ఫేజ్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఒప్పందానికి కట్టుబడి లేకపోవడం వల్లే ఆలస్యం అవుతోందన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నా స్పందన లేదన్నారు. ఎంఎంటీఎస్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎంఎంటీఎస్ హైదరాబాద్‌కు ఎంతో అవసరమన్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ అంటేనే సామాన్యుల ట్రైన్ అని అభివర్ణించారు. ప్రతి నిత్యం ఉద్యోగులు, కార్మికులు, నిరుపేదలు దానిలో ప్రయాణిస్తారని గుర్తు చేశారు.
ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ డిమాండ్‌కు స్పందించి.. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేదన్నారు. ఎంఎంటీఎస్ నిర్మాణానికి సంబంధించి సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రోజులు గడుస్తుండటంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందన్నారు. చివరికి దీనిపై తానే ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. తన అభ్యర్ధన మేరకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను పూర్తిగా కేంద్రమే తీసుకుందని అన్నారు. ఫేజ్ 2లో కొత్తగా 13 రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వస్తాయన్నారు.
బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చామని కిషన్ రెడ్డి తెలిపారు. అది పాత భవనం కావడంతో ఇంకా కొన్ని అనుమతులు చేయాల్సి ఉందన్నారు. మొత్తం రూ.1366 కోట్లతో ఎయిమ్స్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇందు కోసం టెండర్లు పూర్తయ్యాయని.. కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే భూమిని చదును చేసే పనులు పూర్తయ్యాయని.. 8న ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం