TSPSC పేపర్ల లీకేజీ విచారణలో సంచలనాలు.. మల్యాల మండలంలో గ్రూప్‌-1లో 40 మంది క్వాలిఫై సిట్ ఫోకస్

TSPSC పేపర్ లీక్ కేసులో షాకింగ్‌ ఇన్ఫర్మేషన్‌ తో సిట్ షాక్ ఇస్తుంది. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ చైన్‌ లింక్‌ను ఛేదిస్తోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు, పెద్దల తల చుట్టూ తిరిగిన కథ.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంకు మార్చింది. గ్రూప్ వన్ పరీక్ష చేసి.. క్వాలిఫై అయిన 40 మంది విద్యార్థులను టార్గెట్ చేసింది. వారితో విచారణ మొదలు పెట్టింది.

TSPSC పేపర్ల లీకేజీ విచారణలో సంచలనాలు.. మల్యాల మండలంలో గ్రూప్‌-1లో 40 మంది క్వాలిఫై సిట్ ఫోకస్
Tspsc Paper Leak Case
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 04, 2023 | 6:06 PM

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసులో తవ్వేకొద్ది షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఇంత కాలం లీక్ చేసినవారు, సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల చుట్టూ తిరిగిన సిట్.. ఇప్పుడు మరో రూట్లో దూసుకుపోతోంది. ఒకే గ్రామంలో గ్రూప్ 1 పరీక్ష క్వాలిఫై అయిన కొందరు నిందితులను ప్రశ్నిస్తోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూప్‌-1కి 40 మంది క్వాలిఫై అయినట్టు తేల్చింది సిట్. ఇలా క్వాలిఫై అయిన 40 మంది విద్యార్హతలను పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. మల్యాల మండలంలో సిట్‌ ప్రత్యేక బృందాల సోదాలు చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి సొంత మండలంతో సోదాలు జరుగుతుండటంతో ఈ అంశాలను పరిశీలస్తున్నారు.

ఇప్పటివరకూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ ఇప్పుడు పెద్ద తలకాయల వైపు మళ్లింది. తీగలాగేకొద్దీ ఇంటి దొంగలు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. అయితే, TSPSC ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డిని, సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను, TSPSC లింగారెడ్డిని ప్రశ్నించడం మాత్రం పెద్ద విషయంగానే చెప్పుకోవాలి. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌… అనితా రామచంద్రన్‌కు పీఏ కావడం, మరో నిందితుడు రమేష్‌… లింగారెడ్డికి పీఏగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

సిట్‌ ఇన్వెస్టిగేషన్‌లో రోజుకో షాకింగ్‌ ఇన్ఫర్మేషన్‌ బయటికొస్తోంది. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్‌దే కీలక పాత్రగా తేలింది. మూడు ఏఈ పేపర్లను 40లక్షలకు అమ్ముకున్నాడు రాజేశ్వర్. అడ్వాన్స్‌గా 25లక్షలు తీసుకుని, అందులో 10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చాడు. ఆ 10లక్షల్లో ఐదు లక్షల రూపాయలు A1 ప్రవీణ్‌కి ఇచ్చాడు డాక్యా. ఇక, పేపర్లు అమ్మిన డబ్బుతో సొంతూరులో చిట్టీల వ్యాపారం చేసిన రాజేశ్వర్‌, గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చేసినట్టు గుర్తించారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం