- Telugu News Photo Gallery Travel Best and Safest Places for Solo Travel for Women in India Telugu News
Solo Trip for Women: మహిళల కోసం సోలో ట్రిప్.. ఎలాంటి భయంలేదు..! బిందాస్‌గా ఎంజాయ్ చెయొచ్చు..
భారతదేశంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే, అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే మాత్రం భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. కానీ, ఈ అందమైన ఆరు ప్రదేశాలలో అమ్మాయిలు ఎలాంటి భయంలేకుండా హాయిగా ఎంజాయ్ చెయొచ్చు.
Updated on: Apr 04, 2023 | 4:12 PM

Varanasi:ఉత్తర ప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశంలోని అత్యంత మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీనిని కాశీ లేదా బనారస్ అని కూడా అంటారు. ఈ పురాతన నగరం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఒంటరి మహిళలు ఇక్కడ సాయంత్రం గంగా హారతితో పాటు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ దేవాలయం, రుచికరమైన ఆహారం, బోటింగ్ ఆనందించవచ్చు.

ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది ఏడాది పొడవునా చాలా అందంగా ఉంటుంది. నైనితాల్ అంటేనే అందమైన సరస్సులకు ప్రసిద్ధి. హిమాలయ పర్వతాల అంచున ఉండే సుందరమైన సరస్సులు టూరిస్టులకు మంచి విశ్రాంతి కేంద్రాలు. నైటిటాల్ చుట్టు పక్కల మొత్తం 7 సరస్సులు ఉండగా వాటిల్లో బోటింగ్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. మహిళలు ఒంటరిగా ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా ఈ ప్రసిద్ధ హిల్ స్టేషన్‌ను మీకు చక్కటి ఎంపిక అవుతుంది.

Gangtok Tourism-సిక్కిం రాష్ట్రంలోని అతిపెద్ద నగరం గాంగ్‌టక్. సందర్శించడానికి సహజమైన,చాలా ఆకర్షణీయమైన ప్రదేశం. త్సోమ్‌గో సరస్సు, హిమాలయన్ జూలాజికల్ పార్క్, సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తాయి. హిమాలయ పర్వత శ్రేణులలోని రాష్ట్రాలలో సిక్కిం ఒక అందమైన ఆకర్షణలు గల పర్యాటక ప్రదేశం.

Jaisalmer- రాజస్థాన్‌లో సందర్శించాల్సిన అనేక నగరాలు పర్యాటక పరంగా అద్భుతంగా ఉన్నాయి. జైపూర్, ఉదయపూర్ కాకుండా మీరు కొత్త ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే, మీరు జైసల్మేర్ వెళ్ళవచ్చు. ఇక్కడ మహిళలు సురక్షితంగా తిరుగుతారు. దీనిని గోల్డెన్ సిటీ అంటారు. మీరు ఎడారి సఫారీకి వెళ్లవచ్చు, జైన దేవాలయాన్ని సందర్శించవచ్చు. శాపగ్రస్తమైన కులధార గ్రామాన్ని సందర్శించవచ్చు.

ఉత్తరాఖండ్‌లోనే ఉండే మరో కొండ ప్రాంతం ముస్సోరీ. దట్టమైన అడవులతో సుందరమైన హిమాలయాల సోయగం మనం వీక్షించవచ్చు.

Puducherry- మీకు బీచ్ ఇష్టం అయితే గోవా లేదా ముంబయి వంటి జనసమూహం వద్దు అనుకున్నప్పుడు మీరు పుదుచ్చేరి వెళ్ళవచ్చు. ఈ నగరంలో అనేక అందమైన చర్చిలు,దేవాలయాలను సందర్శించవచ్చు. మీరు ఖచ్చితంగా ఇక్కడ సోలో ట్రిప్ ఎంజాయ్ చేస్తారు.

Mussoorie- ఉత్తరాఖండ్‌లోని నిర్మలమైన లోయలలో నెలకొని ఉన్న ముస్సోరీ ఎల్లప్పుడూ సందర్శించదగిన ప్రదేశాల జాబితాలో ఉంటుంది. ఇది ప్రకృతి అందాలతో నిండిన అద్భుతమైన హిల్ స్టేషన్. ముస్సోరీలోని మహిళలు, కెంప్టీ ఫాల్, గన్ లేక్, ముస్సోరీ లేక్ వంటి అనేక అందమైన ప్రదేశాలు అమ్మాయిల భద్రత పరంగా సందర్శించదగినవి.




