Hyderabad: ఫ్లైఓవర్లు/బ్రిడ్జిలపై రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే..ఈ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల్సిందే..

యాక్సిడెంట్‌ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం'.. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే అనర్థాలపై 'సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ చాలామందిని ఆలోజింపచేసింది. కానీ యువతలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.

Hyderabad: ఫ్లైఓవర్లు/బ్రిడ్జిలపై రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే..ఈ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాల్సిందే..
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2022 | 2:13 PM

‘యాక్సిడెంట్‌ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడడం కాదు.. ఓ కుటుంబం రోడ్డున పడడం’.. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే అనర్థాలపై ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ చాలామందిని ఆలోజింపచేసింది. కానీ యువతలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. అవే రహదారులు.. అదే స్పీడ్‌.. అవే యాక్సిడెంట్లు. రయ్‌ రయ్‌మంటూ రహదారులపై బైక్‌, కార్లతో యువత చేసే సర్కస్‌ ఫీట్లు, విన్యాసాలు వారి నూరేళ్ల జీవితాన్ని బలిగొంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలోని రీజినల్‌ రింగ్‌రోడ్డు (RRR), అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR), ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అదుపులేని వేగమేనని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

కాగా నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల షేక్‌ పేట ఫ్లైఓవర్‌ను ప్రారంభించింది. త్వరలో మరికొన్ని ఫ్లై ఓవర్లు కూడా నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలపై రోడ్డు ప్రమాదాలను అరిక్టటేందుకు యువత కచ్చితంగా కొన్ని ట్రాఫిక్‌ నిబంధనల పాటించాలంటున్నారు హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసులు . అవేంటంటే..

Shaikpet Flyover

* ఫ్లైఓవర్‌/ బ్రిడ్జిలపై వాహనాలను అసలు పార్కింగ్‌ చేయకూడదు. * సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదు. *రాత్రివేళల్లో ఎల్‌ఈడీ లాంటి హై ఫోకస్‌ హెడ్‌లైట్ల వాడడం వల్ల ఎదుట వచ్చే వాహనాలకు దారి కనిపించదు. దీనివల్ల ఇద్దరికీ ప్రమాదం కలగవచ్చు. కాబట్టి సాధారణ హెడ్‌లైట్లనే వాడితే మంచిది. *వేగంగా గమ్యాన్ని చేరుకునే క్రమంలో చాలామంది రాంగ్‌టర్న్‌లు తీసుకుంటుంటారు. దీని వల్ల అనుకోని ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి ఆలస్యంగానైనా యూటర్న్ వరకు వెళ్లి తిరిగి రావడం మంచిది. *వాహనదారులు ఫ్లైఓవర్‌/బ్రిడ్జిలపై వెళ్లాలా? వద్దా? అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. అంతేకానీ బ్రిడ్జిపైకి ఎక్కి అటూ ఇటూ తిరిగితే మాత్రం ప్రమాదాల బారిన పడక తప్పదు.

Shaikpet Flyover

*ఫ్లైఓవర్‌/ బ్రిడ్జిలపై కనీస వేగం 30-40 కి.మీ/గంట మించకూడదు. *ఏర్పాటుచేసిన ట్రాఫిక్‌ లైన్లలోనే ప్రయాణించాలి. *కొన్ని ఫ్లైఓవర్‌/ బ్రిడ్జిలపై డివైడర్లు ఉంటాయి. లేకుంటే ఎడమవైపే ప్రయాణం చేయాలి. మధ్యలో అసలు ప్రయాణం చేయకూడదు. *డివైడర్లు ఉన్న వంతెనలు ఇరుకుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించాలి. *ఫ్లై ఓవర్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయకూడదు.

Also Read:

Sampoornesh and Jogi Ramesh: సంపూర్ణేశ్‌బాబుతో కలిసి జుంబా డ్యాన్స్‌ చేసిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌.. వైరలవుతోన్న వీడియో..

Mukku Avinash: బుల్లితెర కమెడియన్ అవినాశ్‌ ఇంటిని చూశారా? .. థీమ్‌ పోస్టర్స్‌ తో గదులను ఎంత బాగా అలంకరించారో..

John Abraham: బాలీవుడ్‌ను వదలని కరోనా.. వైరస్‌ బారిన జాన్ అబ్రహం దంపతులు.. మరో హీరోయిన్‌ కూడా..