తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ బెడ్స్‌ ఎన్ని అందుబాటులో ఉన్నాయి..? పూర్తి వివరాలు

Telangana Hospitals Beds Available: కరోనా మహమ్మారి విజృంభించి దాదాపు రెండేళ్లు అవుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, ఇతర ఆంక్షల కారణంగా గత కొన్ని రోజులుగా..

తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ బెడ్స్‌ ఎన్ని అందుబాటులో ఉన్నాయి..? పూర్తి వివరాలు
Follow us

|

Updated on: Jan 03, 2022 | 1:50 PM

Telangana Hospitals Beds Available: కరోనా మహమ్మారి విజృంభించి దాదాపు రెండేళ్లు అవుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, ఇతర ఆంక్షల కారణంగా గత కొన్ని రోజులుగా అదుపులో ఉంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్‌తో పాటు కరోనా వైరస్‌ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే థర్డ్‌వేవ్‌ కూడా మొదలైపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్క రోజు ఐదు కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 84కు చేరింది. అలాగే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,700 ఒమిక్రాన్‌ కేసులు కాగా, 33,750 కరోనా కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్క రోజు కరోనా బారిన పడి123 మంది మరణించారు. ఇలా ఒక వైపు కరోనా కేసులు.. మరో వైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. థర్డ్‌వేవ్‌ మొదలైన నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం లాంటివి పాటించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహించినట్లయితే ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, ఐసీయూ వివరాలను వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం.

► తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 112 ప్రభుత్వ ఆస్పత్రులు ఉండగా, 1215 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య 1327 ఉన్నాయి.

► ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ బెడ్స్‌ 5,526 ఉండగా, అందులో 85 బెడ్స్‌ మాత్రమే నిండి ఉండగా, 5,441 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో 16,512 బెడ్స్‌ ఉండగా, అందులో 228 బెడ్స్‌ పూర్తిగా రోగులతో నిండి ఉండగా,16,284 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

► ఇక ఆక్సిజన్‌ బెడ్స్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 7,670 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉండగా, 147 బెడ్స్‌ నిండి ఉండగా, 7,523 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో 14,215 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉండగా, అందులో 350 బెడ్స్‌ నిండి ఉన్నాయి. ఇక 13,865 బెడ్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

► అలాగే ఐసీయూ బెడ్స్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం ఐసీయూ బెడ్స్‌ 2,143 ఉండగా, 97 బెడ్స్‌ నిండి ఉన్నాయి. ఇక 2,046 ఐసీయూ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో 9,744 ఐసీయూ బెడ్స్‌ ఉండగా, అందులో303 బెడ్స్‌ రోగులతో్ ఉండగా, ప్రస్తుతం 9441 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

► మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని విభాగాల బెడ్స్‌15,339 బెడ్స్‌ ఉండగా, ఇందులో 329 రోగులతో నిండి ఉన్నాయి. ఈ ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెడ్స్‌ సంఖ్య 15,010. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో అన్ని విభాగాలకు చెందిన బెడ్స్‌40,471 ఉండగా, ఇందులో 881 బెడ్స్‌ రోగులతో నిండి ఉన్నాయి. ఇక 39,590 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Telangana Beds

ఇవి కూడా చదవండి:

Coronavirus: మెడికల్‌ కళాశాలలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు

Numaish: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈనెల 10 వరకు నుమాయిష్‌ ప్రవేశం నిలిపివేత..!

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!